Begin typing your search above and press return to search.
త్వరలో అన్నీ చెబుతా అంటున్న జేడీ...?
By: Tupaki Desk | 2 April 2022 9:46 AM GMTఆయన సీబీఐ మాజీ జేడీ. రాజకీయాల్లో కూడా ఆయన పేరు బాగానే ఉంది. నిజాయతీపరుడైన అధికారిగా పేరు తెచ్చుకున్న జేడీ ఏపీలో యువతతో పాటు, మధ్యతరగతి వర్గాలలో తనదైన అభిమానాన్ని సంపాదించుకున్నారు. లేకపోతే కేవలం పదిహేను రోజుల వ్యవధిలో విశాఖ వంటి పెద్ద పార్లమెంట్ సీటుకు పోటీ చేసి దాదాపుగా మూడు లక్షలకు తక్కువ కాకుండా ఓట్లు తెచ్చుకున్నారు అంటే జేడీ గ్రేటే అనాలేమో.
ఒక వైపు జనసేన పార్టీ, పవన్ సినీ గ్లామర్ తోడుగా ఉన్నా జేడీ వ్యక్తిగత చరిష్మా కూడా బాగానే కలసివచ్చింది అనుకోవాలి. ఇక విశాఖలో ప్రధాన అభ్యర్ధులకు దడ పుట్టించిన జేడీ ఓడినా తన సత్తా అయితే గట్టిగానే చాటారు. ఆ తరువాత్ జనసేనలో ఆయన ఇమడలేకపోయారు. ప్రస్తుతం స్వచ్చందంగానే రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు.
ఏపీలో బీసీలు, బహుజనులు ఏకం కావాలని జేడీ పిలుపు ఇస్తున్నారు. అదే టైం లో కాపుల భేటీలోనూ ఆయన కీలకంగా మారుతున్నారు. రాజ్యాంగం పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న ఈ మాజీ ఐపీఎస్ అధికారి అణగారిన వర్గాలకు రాజకీయం పెద్ద గొంతుగా మారాలని గట్టిగా కోరుకుంటున్నారు. అలాగే నోటు ప్రసక్తి లేని ఓటు రాజకీయాలు రావాలని కూడా ఆయన అంటున్నారు.
ఆయన ఆశయాలకు తగినట్లుగా ఇపుడు ఆమ్ ఆద్మీ పార్టీ కనిపిస్తోంది అంటున్నారు. ఆప్ పార్టీ ఉత్తరాదిన బాగా విస్తరిస్తోంది. ఇక సౌత్ లో కూడా ఆ పార్టీ పట్ల కొన్ని సెక్షనలలో మక్కువ పెరుగుతోంది. దీంతో సరైన వారు సారధిగా ఉంటే విజయాలు సాధ్యమేనని ఆప్ అధినేత కేజ్రీవాల్ భావిస్తున్నారు.
ఇక జేడీ, కేజ్రీవాల్ ఆలోఅనలు ఒకటే కావడం, ఇద్దరు మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారులు కావడంతో ఈ కాంబినేషన్ సూపర్ హిట్ అవుతుంది అని కూడా విశ్లేషణలు ఉన్నాయి. ఏపీలో చూస్తే రెండే పార్టీలు, రెండే కులాలు, ఇద్దరు నాయకుల మధ్యనే దశాబ్దాలుగా రాజకీయం తిరుగుతోంది. మూడవ పార్టీగా ఏదీ పుంజుకునే సీన్ అయితే లేదు. అంతా కలసి కులాల రొంపిలోకి దిగిపోతున్నారు.
రాజకీయాన్ని మళ్లీ అక్కడితే తీసుకెళ్తున్నారు. దాంతో కొత్త రాజకీయం, అన్ని వర్గాలు రాజ్యాంగం ప్రకారం పాలు పంచుకునేలా ఒక గొడుకు కిందకు వస్తే అదే అసలైన ప్రజాస్వామ్యానికి స్పూర్తి అని మేధావులు సైతం భావిస్తున్నారు. దీంతో ఆప్ రాక పట్ల చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది.
ఈ పరిణామాల నేపధ్యంలోనే పూర్తి హోం వర్క్ తో సిద్ధంగా ఉన్న జేడీ త్వరలోనే తన రాజకీయ మార్గం గురించి మీడియాతో పంచుకుంటానని చెప్పి ఆసక్తిని పెంచారు. ఏపీలో ఆప్ విస్తరణకు జేడీ నడుం బిగిస్తారు అని అంటున్నారు. ఆయననే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ముందు పెట్టి కేజ్రీవాల్ ఏపీలో పార్టీని విస్తరిస్తారు అని అంటున్నారు. మొత్తానికి వైట్ కాలర్ పాలిటిక్స్ కి ఏపీ ఎంతవరకు అవకాశం ఇస్తుంది అన్నది పక్కన పెడితే ఆ దిశగా కొత్త పార్టీలు రంగంలోకి దిగడం, ప్రజలకు మరో అవకాశాన్ని కల్పించడం వరకూ మాత్రం అంతా మెచ్చుకోవాలి.
రాజకీయాల్లో ఎపుడేమి జరుగుతుంది అన్నది ఎవరికీ తెలియదు. నవ్విన నాపచేనే పండినట్లుగా ఆప్ ని ఏమీ కాదని తీసిపారేసే సీన్ కూడా పాలిటిక్స్ లో ఉండదు అంటున్నారు. వర్తమాన పరిస్థితుల పట్ల విసిగి వేసారిన జనాలు ఆప్ వైపు చూసినా చూడవచ్చేమో. అయితే అదంతా ఆప్ నాయకత్వం మీద జేడీ దీక్షా దక్షతల మీదనే ఆధారపడి ఉంటుంది అన్నది మాత్రం నిజం.