Begin typing your search above and press return to search.
లోక్ సభ బరిలో జేడీ.. ఇక్కడినుంచే పోటీ
By: Tupaki Desk | 18 March 2019 6:12 AM GMTజనసేనలోకి జేడీ లక్ష్మీనారాయణ చేరిక ఏపీ పాలిటిక్స్ లో హీట్ పెంచింది. సీబీఐ జేడీగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో కీలక కేసులను టేకప్ చేసిన జేడీ రాజకీయాలపై ప్రేమతో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి సొంతంగా పార్టీ పెడుదామనుకున్నారు. కానీ కుదరదలేదు. ఆ తర్వాత టీడీపీలో చేరుదామని గంటా సహా టీడీపీ పెద్దలతో చర్చలు జరిపారు. ఆ పార్టీలో చేరుతారని భావించినా చివరకు శనివారం అర్ధరాత్రి ఆయన జనసేన పార్టీలో చేరడం హాట్ టాపిక్ గా మారింది.
జనసేనాని పవన్ జేడీకి కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జేడీ సంచలన కామెంట్స్ చేశారు. తనకు కోట్లు వచ్చే పోలీస్ వృత్తిని వదిలి ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానన్నారు. డబ్బులు లేకుండా రాజకీయం లేని నేటి రోజుల్లో మార్పు కోసం పార్టీని పవన్ స్థాపించారని కొనియాడారు.
అయితే అనూహ్యంగా టీడీపీని కాదని జనసేనలో చేరిన జేడీ లక్ష్మీనారాయణ ఈసారి బరిలోకి దిగడానికే ఈ పనిచేశాడన్న వార్తలు వెలువడుతున్నాయి. విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీచేయడానికి జేడీ ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఉన్నత విద్యావంతులు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి జేడీ గెలుపు సులభమన్న అంచనాతోనే జనసేన ఆయనకు ఈ స్థానం కేటాయించినట్లు సమాచారం. ఇక్కడ జనసేన తరుఫున ప్రకటించిన అభ్యర్థి గేదెల శ్రీనివాస్ వైసీపీలో చేరారు. నామినేషన్ కు ముందే ఆయన పార్టీ ఫిరాయించడంతో జనసేన షాక్ తిన్నది. ఈ నేపథ్యంలోనే బలమైన జేడీకి విశాఖ సీటు కన్ఫం చేసినట్టు సమాచారం.