Begin typing your search above and press return to search.

ఎగ్జిట్ పోల్స్: రూల్స్ మాట్లాడుతున్న జనసేన నేత!

By:  Tupaki Desk   |   20 May 2019 1:26 PM GMT
ఎగ్జిట్ పోల్స్: రూల్స్ మాట్లాడుతున్న జనసేన నేత!
X
ఎగ్జిట్ పోల్స్ వెల్లడించే సంస్థలు తమ కచ్చితత్వాన్ని నిరూపించుకోవాలి..' అని అంటున్నారు జనసేన నేత వి.లక్ష్మీనారాయణ. అసలు ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేయడమే సమంజసం కాదని ఈయన చెబుతూ ఉండటం గమనార్హం! ఏదైనా సంస్థ ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేసినా.. అది అవి కచ్చితంగా నిజం అని నిరూపించుకోవాలని ఈయన అంటున్నారు. ఎంత మాజీ పోలీసు అయితే మాత్రం ఇలా రూల్స్ మాట్లాడితే ఎలా సారు! అనక తప్పదు ఈయన విషయంలో.

ఎగ్జిట్ పోల్స్ ఎవరికీ అంత అపకారం చేసేవి ఏమీ కాదు. ప్రీ పోల్ సర్వేల్లా ఇవి ఓటర్లను కూడా ప్రభావితం చేసేవి కావు. ఆల్రెడీ పోలింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు మీడియా సంస్థలు ప్రజల నాడిని పట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ విషయంలో ఎవరి అంచనాలు వారివి. ఈ అంచనాలు ఎవరికి వారివి కరెక్టే అనిపిస్తాయి. అయితే ఇవి ఏ రకంగానూ అసలు ఫలితాలను ప్రభావితం చేయలేవు.

అసలు ఫలితాలు అసలువే. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్సే. ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఏదైనా సంస్థ కచ్చితత్వాన్ని నిరూపించుకుంటే అది జనాల క్రెడిబులిటీని పొందుతుంది. అలా కాకపోతే ప్రజలు ఆ సంస్థను ముందు ముందు నమ్మడం మానేస్తారేమో. అది ప్రజలకూ - మీడియాకు మధ్యన వ్యవహారం.

అయితే లక్ష్మీనారాయణ మాత్రం.. ఎగ్జిట్ పోల్స్ వెల్లడించే సంస్థలు అవి నిజమని నిరూపించాలని కూడా చెబుతున్నారు. అసలుకు సీబీఐ పెట్టే కేసులే ఎన్ని నిలబడుతున్నాయో ఎవరికీ తెలియడం లేదు. అలాంటిది ఎగ్జిట్ పోల్స్ నిజమని నిరూపించాలని ఈయన డిమాండ్ చేయడం ఏమిటో!

జనసేన పార్టీ ఏపీలో చిత్తుగా ఓడుతుందని వివిధ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో వీటి మీద ఈ జనసేన నేతకు చాలా ఎక్కువ అసహనం కలుగుతున్నట్టుగా ఉందని పరిశీలకులు అంటున్నారు!