Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ పార్టీలోకి సీబీఐ మాజీ జేడీ?

By:  Tupaki Desk   |   5 Nov 2016 4:49 AM GMT
ప‌వ‌న్ పార్టీలోకి సీబీఐ మాజీ జేడీ?
X
జ‌న‌సేన పార్టీ అధినేత‌ - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనంత‌పురంలో స‌భ నిర్వ‌హించ‌నున్న నేప‌థ్యంలో కొత్త కొత్త అంచ‌నాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో కాపుల రిజ‌ర్వేష‌న్‌ - బీసీల‌కు స‌మాన ప్రాధాన్యం అనే అవ‌కాశం తెర‌పైకి వ‌స్తున్న క్ర‌మంలో ఈసారి సామాజిక అంశాలపై సభ నిర్వహిస్తోన్న పవన్ - కాపు-బీసీ రిజర్వేషన్ల గురించి కూడా ప్రస్తావించే అవకాశం ఉందంటున్నారు. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నార‌ని అంటున్నారు. ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జగన్ కేసులో శరవేగంగా స్పందించి జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ఒక అధికారితో రెండుసార్లు భేటీ అయ్యారని - ఆయనను తన పార్టీలో చేరి కీలకపాత్ర పోషించాలని ప్రతిపాదించినట్లు స‌మాచారం.

వివిధ వ‌ర్గాల అభిప్రాయం ప్ర‌కారం స‌ద‌రు అధికారి సీబీఐ మాజీ జాయింట్ డైరెక్ట‌ర్ ల‌క్ష్మీనారాయ‌ణ అని తెలుస్తోంది. జ‌న‌సేన‌ను విశాల అభిప్రాయాల‌కు వేదిక‌గా - అన్నివ‌ర్గాల ఆమోదం పొందిన నాయ‌కులకు కేరాఫ్ అడ్ర‌స్‌ గా తీర్చిదిద్దేందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో సీమ‌లో స‌భ పెడుతున్న స‌మ‌యంలో త‌మ పార్టీలో చేరాల‌నే ప్ర‌తిపాద‌న‌ను ఆయ‌న ముందు ఉంచిన‌ట్లు తెలుస్తోంది. అయితే దీనిపై జ‌న‌సేన వ‌ర్గాల‌ అధికారిక వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు. మరోవైపు అనంతపురంలో సభ నిర్వహణపై పవన్ ప్రత్యేక కసరత్తు చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ హోదా వచ్చినట్లయితే ఏటా కరువులతో సతమతమవుతున్న అనంతపురం జిల్లాకు ఎంలో ఉపయోగంగా ఉంటుందని పవన్ అభిప్రాయపడ్డారు. స్పెషల్ స్టేటస్ వల్ల వచ్చే నిధులతో ఈ జిల్లాను కరువు నుంచి కాపాడుకోవచ్చని భావిస్తుండ‌టం వ‌ల్లే ఈ సారి బహిరంగ సభకు అనంతపురం జిల్లాలో నిర్వహించాలని నిశ్చయించినట్లు వివ‌రించారు. అనంతలో జ‌రిగే ఈ స‌భ‌కు "సీమాంధ్ర హక్కుల చైతన్య సభ "గా పవన్ కల్యాణ్ నామకరణం చేశారని జ‌న‌సేన తెలిపింది. న‌వంబ‌ర్ 10న సాయంత్రం నాలుగు గంటలకు అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో సభ జరగనుందని జ‌న‌సేన వివ‌రించిన సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/