Begin typing your search above and press return to search.

అదేంది శీలం.. అనువాదం చంపేశావుగా..

By:  Tupaki Desk   |   5 Jun 2017 5:23 AM GMT
అదేంది శీలం.. అనువాదం చంపేశావుగా..
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ మూడేళ్ల త‌ర్వాత భారీ స‌భ‌ను పెట్టి మ‌రీ కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ స్ప‌ష్టం చేయ‌టం తెలిసిందే. గుంటూరులో ఏర్పాటు చేసిన ఈ స‌భ‌లో.. ప్ర‌త్యేక హోదా అంశంపై ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశార‌ని చెప్పాలి. ఏపీకి హోదా ఇచ్చే విష‌యంలో కాంగ్రెస్ మాత్ర‌మే కాద‌ని.. యూపీఏ ప‌క్షాల‌న్నీ ఉన్న‌య‌న్న విష‌యాన్ని తాజా స‌భ‌తో ఏపీ ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసే ప్ర‌య‌త్నం చేశారు.

దేశంలోని వివిధ రాజ‌కీయ పార్టీ నేత‌లంతా ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశంపై మ‌ద్ద‌తు ఇస్తుంటే.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు అస‌లు ఆ ఊసే ప‌ట్ట‌డం లేదంటూ రాహుల్ వేసిన‌ సూటి ప్ర‌శ్న స‌ర్కారును ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ప‌వ‌ర్ ఫుల్ ప్ర‌సంగాన్ని.. అంతే ప‌వ‌ర్ ఫుల్‌ గా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల్సిన వేళ‌.. సంబంధం లేని వ్యాఖ్య‌లు చేస్తే చిరాకు పుట్ట‌టం ఖాయం. తాజాగా గుంటూరులో నిర్వ‌హించిన స‌భ‌లో రాహుల్ గాంధీ ప్ర‌సంగాన్ని తెలుగులోకి అనువాదం చేసే బాధ్య‌త‌ను నెత్తిన వేసుకున్నారు జేడీ శీలం. సీనియ‌ర్ మాజీ ఐఏఎస్ అధికారి ఈ తెలుగు పెద్ద‌మ‌నిషి.. రాహుల్ హిందీలో చెబుతున్న మాట‌ల్ని తెలుగులోకి అనువదించే విష‌యంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌ని చెప్పాలి.

విభ‌జ‌న‌కు సంబంధించి హోదా విష‌య‌లో త‌న‌కున్న స్ప‌ష్ట‌త‌ను త‌న మాట‌ల‌తో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌దునైన ప‌ద‌జాలాన్ని వాడారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల్ని య‌థాత‌ధంగా.. అంతే ఫీల్ క్యారీ అయ్యేలా చేయ‌టంలో జేడీ శీలం ఫెయిల్ అయ్యార‌నే చెప్పాలి. ఒక ముఖ్య‌నేత మాట‌ల్ని య‌థాత‌ధంగా చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది. అనువాదంలో భాగంగా ఒక‌ట్రెండు మాట‌లు క‌లిపినా ఫ‌ర్లేదు. కానీ.. అందుకు భిన్నంగా సాగితేనే ఇబ్బంది అంతా. తాజాగా రాహుల్ ప్ర‌సంగాన్ని జేడీ శీలం అనువ‌దించే విష‌యంలో రాహుల్ మాట‌లకు త‌న సొంత పైత్యాన్ని రంగ‌రించిన వైనం చిర్రెత్తేలా చేసింద‌ని చెప్పాలి. కీల‌క ప్ర‌సంగాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే విష‌యంలో కాంగ్రెస్ ముఖ్య‌నేత‌లు మ‌రింత క‌స‌రత్తు చేయ‌టంతో పాటు.. మంచి అనువాద‌కుడ్ని పెట్టుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్న విష‌యాన్ని రాహుల్ గుర్తిస్తే మంచిది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/