Begin typing your search above and press return to search.
జస్ట్ ఓవర్ టేక్ చేశాడని చంపేసిన ఎమ్మెల్సీ కొడుకు
By: Tupaki Desk | 9 May 2016 4:48 AM GMTపవర్ నెత్తికి ఎక్కితే ఎంత దారుణ పరిస్థితులు చోటు చేసుకుంటాయనటానికి తాజా ఉదంతం ఓ పెద్ద ఉదాహరణగా చెప్పాలి. బీహార్ కు చెందిన ఒక ఎమ్మెల్సీ పుత్రరత్నం ఘనకార్యం ఇప్పుడా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారటమే కాదు.. నితీష్ సర్కారుపై తీవ్ర విమర్శలకు కారణంగా మారింది. బీహార్ అధికారపక్షమైన జేడీయూకి చెందిన ఓ ఎమ్మెల్సీ కుమారుడు చేసిన ఓవర్ యాక్షన్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తోంది.
తన కారును ఓవర్ టేక్ చేసిన వ్యక్తిపై ఆగ్రహించిన ఎమ్మెల్సీ కుమారుడు రాకీ కుమార్ యాదవ్.. తన దగ్గరున్న పిస్టల్ తో వాహనాన్ని ఓవర్ టేక్ చేసిన వ్యక్తిని కాల్చి చంపటం సంచలనంగా మారింది. గయ వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జేడీయూ ఎమ్మెల్సీ మనోరమా దేశి కుమారుడు రాకీ కుమార్ యాదవ్. అమ్మ పవర్ కొడుకు నెత్తికి బాగానే పట్టినట్లుంది.
తన కారును ఓవర్ టేక్ చేసిన 20 ఏళ్ల యువకుడితో గొడవ పెట్టుకున్న ఎమ్మెల్సీ కుమారుడు.. కోపానికి గురై తన దగ్గరున్న పిస్టల్ తో సదరు యువకుడి మీద కాల్పులు చేయటంతో.. ఆ కుర్రాడు అక్కడికక్కడే మరణించినట్లుగా తెలుస్తోంది. తాజా ఘటన నేపథ్యంలో రాకీ తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పుత్రరత్నం కోసం గాలిస్తున్నారు. ఇలాంటి ఘటనలకు కారణమైన నేతలపైనా బీహార్ అధికారపక్షం చర్యలు తీసుకుంటే మరింత బాగుంటుంది.