Begin typing your search above and press return to search.
వీళ్లిద్దరూ కలిస్తే బీజేపీ చిత్తు చిత్తేనా?
By: Tupaki Desk | 27 March 2018 10:12 AM GMTకర్ణాటక అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ కొద్దిసేపటి క్రితమే విడుదలైన విషయం తెలిసిందే. ఈసీ ప్రకటన విడుదల కావటానికి ముందే ఒక సంచలనం చోటు చేసుకోగా.. విడుదలయ్యాక ఆసక్తికర పరిణామాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వివరాల్ని ఈసీ వెల్లడించటానికి ముందే ట్వీట్ రూపంలో బీజేపీ బయట పెట్టటంపై దుమారం రేగుతోంది. దీనిపై విమర్శలు చెలరేగుతుండగా.. బీజేపీకి ఇబ్బంది పెట్టే పరిణామం మరొకటి చోటు చేసుకుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటానికి తాము సిద్ధంగా ఉన్నట్లుగా జనతాదళ (సెక్యులర్) అధినేత హెచ్ డి దేవగౌడ ప్రకటించిన వైనం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తాము కాంగ్రెస్ తో ఎన్నికల పొత్తుకు సిద్దమన్నారు. కాంగ్రెస్ ఎన్నికల పొత్తుకు ముందుకు వస్తే తమ పార్టీ పూర్తి సహకారం అందిస్తుందన్నారు. అయితే.. ఎన్నిసీట్లు తమకు కాంగ్రెస్ ఇవ్వాలనుకుంటున్న విషయానని తమకు చెప్పాలన్నారు.
ఇప్పటికే మాయావతితో ఎన్నికల పొత్తును జనతాదళ్ ఓకే చేసుకుంది. కర్ణాటకలోని 14జిల్లాల్లో 8 రిజర్వ్ సీట్లు.. 12 జనరల్ అసెంబ్లీ సీట్లలో బీఎస్పీ పోటీ చేయనున్నట్లు చెబుతున్నారు. మిగిలిన 204 సీట్లలో జనతాదళ్ పోటీ చేయనుంది. సమాజ్ వాదీ పార్టీ మరో సీటు అడగనుందని.. జేడీఎస్ కొన్నిసీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే.. కాంగ్రెస్ పార్టీ పొత్తుకు సిద్ధంగా ఉందా? లేదా? అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మధ్యనే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. జనతాదళ్ పార్టీ బీజేపీకి తెర వెనుక నుంచి మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. బీజేపీకి బి పార్టీగా జనతాదళ్ వ్యవహరిస్తుందన్న ఘాటు విమర్శలు రాహుల్ చేసిన కొద్దిరోజులకే.. అవన్నీ పాత ముచ్చట్లు.. కొత్తగా లింకుల లంకె తేల్చాలంటూ దేవగౌడ చేసిన ప్రకటన నిజంగానే వర్క్ వుట్ అయి కాంగ్రెస్ చేతులు కలిపితే మాత్రం.. బీజేపీకి భారీ అపజయం ఖరారైనట్లే. ఇప్పటికే నిర్వహించిన సర్వేలలో కాంగ్రెస్ తన బలాన్ని కాపాడుకుందని.. మోడీ బ్యాచ్ కు ఏ మాత్రం బాగోలేదన్న మాట వినిపిస్తున్న వేళ.. దేవగౌడ నోటి నుంచి వచ్చిన ఆఫర్ కమలనాథులకు కొత్త కష్టాన్ని తెచ్చి పెట్టటం ఖయమంటున్నారు.