Begin typing your search above and press return to search.

కుమారస్వామి ఆక్రోషం.. అడుక్కోడట..

By:  Tupaki Desk   |   20 Feb 2019 11:18 AM GMT
కుమారస్వామి ఆక్రోషం.. అడుక్కోడట..
X
కర్ణాటకలో పొత్తుల సంసారంతో ప్రభుత్వాన్ని ఈదుకొస్తున్నాయి జేడీయూ-కాంగ్రెస్ లు.. ఎప్పుడు కూలుపోతుందో తెలియక సీఎం కుమారస్వామి కాపాలా కాస్తున్నారు. బీజేపీ కుట్రలను - కాంగ్రెస్ ఎమ్మెల్యేల బుజ్జగింపులతో ఆయన రోజు నరకం అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే పార్లమెంట్ ఎన్నికలు కర్ణాటకలో అటు కాంగ్రెస్ కు - ఇటు జేడీయూ కు కీలకంగా మారాయి.

కర్ణాటకలో మొత్తం 28 లోక్ సభ సీట్లున్నాయి. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం కోసం మిత్రపక్ష మైన జేడీఎస్ కు ఈసారి 8 సీట్లలోపే ఇస్తామని ప్రతిపాదన పంపిందట.. దీంతో జేడీఎస్ అధినేత సీఎం కుమారస్వామి రగిలిపోతున్నారు. బీజేపీతో కలిసి పోటీచేసినా తమకు 12 సీట్లు ఇస్తారని.. మరీ 8 లోపు ఏంటని ఆయన సన్నిహితుల వద్ద వాపోయారు. దీంతో అలెర్ట్ అయిన కాంగ్రెస్ పార్టీ.. ‘ సీట్ల పంపిణీ చర్చలు ఇప్పుడే ప్రారంభమయ్యాయని.. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేని’ కర్ణాటక పీసీసీ చీఫ్ దినేష్ తెలిపారు.

ఇక తమకు 8 లోపే సీట్లు ఆఫర్ చేసిన కాంగ్రెస్ పార్టీ తీరుపై ముఖ్యమంత్రి కుమారస్వామి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతల ముందు దేహీ అంటూ సీట్ల కోసం అడుక్కోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్టానంతోనే తేల్చుకుంటామని చెప్పారు.

ఇక మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య కూడా జేడీఎస్ తో పొత్తు వ్యవహారంలో ఎవరూ బెగ్గర్స్ కాదని వివరణ ఇచ్చారు. బలంగా ఉన్న సీట్లనే జేడీఎస్ కోరుతోందని.. దానిపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. తమ ఉమ్మడి శత్రువు బీజేపీని ఓడించేందుకు అవసరమైతే రాజీ పడుతామని ఆయన తెలిపారు.