Begin typing your search above and press return to search.
ట్రంప్ నన్ను రేప్ చేశాడు.. డీఎన్ఏ ఇస్తే నిరూపిస్తా
By: Tupaki Desk | 31 Jan 2020 10:04 AM GMTఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ రసికత, రాసలీలల గురించి కథలు కథలుగా చెబుతూనే ఉన్నారు. ఆయన అధ్యక్షుడు కాకముందు వేసిన వేషాలు, చేసిన రసికత, ఆడవాళ్లను లైంగికంగా వాడుకున్న దానిపై ఎంతో మంది బయటకొచ్చి అభాసుపాలు చేశారు.
తాజాగా మరో మహిళ తనను ట్రంప్ రేప్ చేశాడని.. ఆయన డీఎన్ఏ ఇస్తే నిరూపిస్తానంటూ రోడ్డెక్కింది. 1990లో మాన్ హట్టన్ లోని ఓ విలాసవంతమైన స్టోర్ లో ట్రంప్ తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. అయితే ట్రంప్ మాత్రం అలాంటి మహిళను తన జీవితంలోనే కలవలేదని ఆరోపణలను ఖండించారు.
తాజాగా జీన్ కరోల్ అనే మహిళ న్యూయార్క్ సుప్రీం కోర్టు లో ట్రంప్ రేప్ చేశాడని.. ఆరోజున తను వేసుకున్న బట్టలపై వీర్యం పడిందని.. ట్రంప్ డీఎన్ఏ శాంపిల్ ఇస్తే ఖచ్చితంగా నిరూపిస్తానని పిటీషన్ వేసింది. ట్రంప్ కు తన న్యాయవాదుల ద్వారా నోటీసులు పంపింది. మార్చి 2న ట్రంప్ డీఎన్ఏ శాంపిల్ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
కాగా మహిళను రేప్ చేశానన్న ఆరోపణల్లో నిజం లేదని ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ట్రంప్ ను కనుక డీఎన్ఎ శాంపిల్ ఇవ్వాలని కోర్టు ఆదేశించినా.. ఒకవేళ ట్రంప్ ఇచ్చినా కానీ ఈ కేసులో ట్రంప్ దోషా, నిర్ధాశా అన్నది తేలిపోనుంది.