Begin typing your search above and press return to search.
క్విడ్ ప్రో కో...జగన్ చేయడం లేదు
By: Tupaki Desk | 23 Jun 2015 9:50 AM GMTక్విడ్ ప్రో కో...పేరు వినగానే చప్పున గుర్తుకు వచ్చే పేర్లు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్. సీఎం హోదాలో ప్రభుత్వం ద్వారా వైఎస్‌ఆర్ పారిశ్రామికవేత్తలకు పలు రకాల మేలు చేయిస్తే....జగన్ వారితో తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించుకున్నారని...ఇదంతా నీకిది-నాకది (క్విడ్ ప్రో కో) కోణంలో సాగిందనేది బలమైన ఆరోపణ. అయితే ఇపుడు జగన్ అధికారంలో లేడు కాబట్టి క్విడ్ ప్రో కో విషయంలో ఆయన పేరు తెరమీదకు రావడంలేదు. మరి అసలు నీకిది-నాకది అనే వ్యవహారం నడుస్తోందా? అలా జరిగితే ఆ మేరకు చేస్తోంది ఎవరు? వీటన్నింటికీ టీ కాంగ్రెస్ ఉప నేత టి.జీవన్‌రెడ్డి కొత్త లాజిక్ తో సమాధానం ఇచ్చారు.
ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య 'క్విడ్ ప్రో కో' వ్యవహారం నడుస్తోందని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఓటుకు నోటు, ఫోన్ల ట్యాపింగ్ కేసుల్లో విచారణ సాగకుండా వారిద్దరు ఒక ఒప్పందానికి వచ్చారని ఆయన చెప్తున్నారు. తన వాదనలో వాస్తవం ఎంతో కూడా ఆయన గణంకాల ఆధారంగా వివరిస్తున్నారు.
ఓటుకు నోటు వ్యవహారంలో మే 31న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అరెస్టయ్యారని, అంతకు ముందు మే 30న స్టీఫెన్‌న్సన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడినట్లు వార్తలు వచ్చాయన్నారు. ఈ మేరకు తమ వద్ద రికార్డు అయిన వీడియోలు, టేపులు ఉన్నాయంటూ టీఆర్‌ఎస్ నేతలు ప్రకటించారని గుర్తు చేశారు. అదే క్రమంలో తన ఫోన్‌ను ట్యాపింగ్ చేశారంటూ చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు ఆరోపించారని చెప్పారు. ఇలా రెండు కేసుల్లో ఆధారాలు దొరికాయని చెబుతున్నప్పటికీ... దర్యాప్తు ఎందుకు ముందుకు వెళ్లడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ రెండు కేసులతో రెండు రాష్ట్రాల్లో రాద్ధాంతం చోటు చేసుకుందని, కానీ... ఇప్పుడంతా చల్లబడడానికి కారణమేంటటని జీవన్ రెడ్డి నిలదీశారు.
అసలేం చప్పుడు లేకుండా ఉన్న ఓటుకునోటు, ట్యాపింగ్ ఆరోపణలు పరిస్థితి చూస్తే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులయిన చంద్రబాబు, కేసీఆర్ మధ్య ఒప్పందం కుదిరినట్లు కనిపిస్తోందని జీవన్ రెడ్డి అన్నారు. ''నాపై విచారణ సాగకుండా నువ్వ చూడు, నీపై విచారణ సాగకుండా నేను చూస్తా' అన్నట్లుగా ఇద్దరి మధ్య 'క్విడ్ ప్రో కో ఒప్పందం' జరిగిందని ఆయన విమర్శించారు. అందుకే ఈ రెండు కేసులపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఒక్కసారిగా రెండు కేసులు ఎందుకు స్తబ్ధుగా ఉన్నాయనే సందేహానికి జీవన్ రెడ్డి భలే లాజిక్కుతో స్పందించారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.