Begin typing your search above and press return to search.
బీజేపీకి కొత్త అర్థాన్ని.. అరవింద్ కు కొత్త పేరు పెట్టేశాడు
By: Tupaki Desk | 23 Aug 2021 3:31 AM GMTతెలంగాణలో బీజేపీ.. టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం అంతకంతకూ ముదురుతున్న సంగతి తెలిసిందే. ఏ మాత్రం అవకాశం చిక్కినా వదిలిపెట్టకుండా విరుచుకుపుడుతున్న బీజేపీ నేతలపై గులాబీ నేతలు ఎదురుదాడి షురూ చేశారు. తాజాగా టీఆర్ఎస్ కు చెందిన ఫైర్ బ్రాండ్ జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సరదాగా ఉంటూ.. పార్టీ నేతలతో జోకులు వేసే ఆయన.. తేడా వస్తే ఎంత సీరియస్ అవుతారో తెలియంది కాదు. ప్రస్తుతం ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న జీవన్ రెడ్డి తాజాగా బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. ఆ మాటలు విన్నంతనే కమలనాథులకు ఎక్కడో కాలేలా ఉండటం గమనార్హం.
బీజేపీ అంటే బిగ్ జోకర్స్ పార్టీ అని.. అందులో బిగ్ లోఫర్ ఎంపీ అరవింద్ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిజామాబాద్ కు పసుపు బోర్డు తెస్తానని.. నకిలీ హామీ పత్రం రాసి ఇచ్చాడని మండిపడ్డారు. అరవింద్ లాంటి నేతకు సీఎం కేసీఆర్ మంత్రులు కేటీఆర్.. హరీశ్ రావులు.. ఎమ్మెల్సీ కవితల గురించి మాట్లాడే స్థాయి ఉందా? అని ప్రశ్నించారు.
దాదాపు వారం క్రితం జరిగిన హుజూరాబాద్ దళితబంధు సభ గురించి ఎంపీ అరవింద్ ఇప్పుడు మాట్లాడటం ఏమిటని సీరియస్ అయ్యారు. దొంగలు పడిన ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లుగా.. సభ జరిగిన వారానికి ఇప్పుడు గళం విప్పటం ఏమిటి? అని ప్రశ్నించారు. చీటికి మాటికి ముఖ్యమంత్రి కేసీఆర్ ను జైలుకు పంపుతామని చెప్పే బీజేపీ నేతలు ఆ మాటల్ని బంద్ చేయాలన్నారు. బీజేపీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల మనసుల్ని గెలుచుకోలేరన్నారు. పాదయాత్రలు కాదు.. మోకాళ్ల మీద నడిచినా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావటం కల్ల అని తేల్చారు. ఘాటు వ్యాఖ్యలు చేసిన జీవన్ రెడ్డికి.. ఎంపీ అరవింద్.. బీజేపీ నేతలు ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.