Begin typing your search above and press return to search.

జగిత్యాలలో టీఆర్ ఎస్ విజయం..జీవన్ రెడ్డి ఓటమి

By:  Tupaki Desk   |   11 Dec 2018 10:17 AM IST
జగిత్యాలలో టీఆర్ ఎస్ విజయం..జీవన్ రెడ్డి ఓటమి
X
తెలంగాణలో రెండో ఫలితం వచ్చింది. జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉప నేత - కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఓడిపోయారు. టీఆర్ ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ ఘన విజయం సాధించారు.

సీఎం కేసీఆర్ కూతురు కవిత జగిత్యాలలో జీవన్ రెడ్డిని ఓడించేందుకు పంతం పట్టారు. తన తండ్రి కేసీఆర్ పై వైఎస్ హయాంలో పోటీచేసి గట్టిపోటీనిచ్చిన కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉప నేత జీవన్ రెడ్డిని ఓడిస్తానని శపథం చేసింది. దాదాపు రెండు నెలలుగా జగిత్యాల నియోజకవర్గంలో మాటు వేసి.. మాయ చేసి జీవన్ రెడ్డిని ఓడించే బాధ్యతను భుజాన వేసుకుంది. తాజాగా ఓట్ల లెక్కింపులో జగిత్యాలలో జీవన్ రెడ్డి ఓడిపోయారు. తెలంగాణలో వెలువడ్డ మొదటి ఫలితంలో ఎంఐఎం అభ్యర్తి అక్బరుద్దీన్ గెలువగా.. రెండో ఫలితం జగిత్యాలదే.. ఇక్కడ జీవన్ రెడ్డిపై టీఆర్ ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ గెలిచారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఉద్యమ తీవ్రతలో కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా 2006 - 2008లో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లారు. కేసీఆర్ పై అప్పటి జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎంపీగా పోటీచేసారు. దాదాపు కేసీఆర్ ను ఓడించినంత పనిచేశారు. తండ్రిని ముప్పుతిప్పలు పెట్టిన జీవన్ రెడ్డిని ఓడించి తీరుతానని కవిత రెండు నెలలుగా జగిత్యాలలోనే మకాం వేసింది. అన్నట్టే తాజాగా ఫలితాల్లో జీవన్ రెడ్డిని ఓడించి తండ్రి కేసీఆర్ కు కవిత గిఫ్ట్ గా ఇచ్చారు.