Begin typing your search above and press return to search.
కేసీఆర్‌పై జీవన్ రెడ్డి టైమ్లీ పంచ్..!
By: Tupaki Desk | 28 Jun 2015 4:29 AM GMTరోజూ చేసే విమర్శలే అయినా.. రోజూ మాట్లాడే టాపిక్‌ల గురించి అయినా.. కాస్తంత ఆసక్తికరంగా చెబితే వినేవాళ్లకు కూడా కొత్తగా ఉంటుంది. రొటీన్ విమర్శలకు కరెంట్ కంటెంట్‌ను కూడా జోడిస్తే అది టైమ్లీగా ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అలాగే స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ధ్వజమెత్తుతూ జీవన్ రెడ్డి పంచ్ వేశారు.
కేసీఆర్ ఫామ్ హౌస్ గురించి, అక్కడ సాగవుతున్న పంటల గురించి, వాటిపై తెలంగాణ సీఎం పెట్టే శ్రద్ధ గురించి మీడియాలో వస్తున్న కథనాల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కేసీఆర్ ఆదర్శవ్యవసాయం చేసే క్షేత్రంలో అల్లం సాగవుతోందని.. ఇటీవలే కాప్సికం మంచి దిగుబడితో పండిందని వార్తలు వస్తూ ఉంటాయి. ఆ పంటల సాగు విషయంలో కేసీఆర్ ఎంత శ్రద్ద చూపుతున్నాడో కూడా మీడియాలో కథలు కథలుగా వస్తున్నాయి.
మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు జీవన్ రెడ్డి ఆ అంశాలను ఆధారంగా చేసుకొని కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. ఎంతసేపూ మీ వ్యవసాయక్షేత్రంలో పంటల గురించినే కాదు... రైతు సమస్యల్ని కూడా పట్టించుకోండి అంటూ జీవన్ రెడ్డి సలహా ఇచ్చారు.
కేసీఆర్ తన వ్యవసాయాన్ని మాత్రమే కాకుండా తెలంగాణలోని వ్యవసాయదారులు పడుతున్న కష్టాల గురించి కూడా పట్టించుకోవాలని.. వర్షాలు పడుతున్న విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి సొంత పొలంలోని అల్లం పంటపై దృష్టిపెట్టడం దారుణమని జీవన్ వ్యాఖ్యానించారు.
మరి కేసీఆర్ సొంత పొలం మీద ఎంత కాన్సన్‌ట్రేట్ చేస్తున్నాడో కానీ.. ఆయన గురించి వచ్చిన వార్తలను మాత్రం ఈ ప్రతిపక్ష నేత ఉపయోగించుకొని రైతుల సమస్యలకు ముడిపెట్టి ధ్వజమెత్తాడు!