Begin typing your search above and press return to search.

టీడీపీ అంటే జీవన్ రెడ్డికి అంత కోపమా?

By:  Tupaki Desk   |   13 Sep 2016 11:10 AM GMT
టీడీపీ అంటే జీవన్ రెడ్డికి అంత కోపమా?
X
మల్లన్న సాగర్ నిర్వాసితులకు అండగా తెలంగాణలో జరుగుతున్న పోరాటల నేపథ్యంలో టీఆరెస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. తాము టీడీపీతో కలిసి ఆందోళనలు చేస్తున్నామనడం భావ్యం కాదని అంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి అయితే ''మేమా... టీడీపీతో కలవడమా.. ఏంటీ వక్రీకరణలు" అంటూ తెగ చిరాకు పడుతున్నారు. ఎందుకో తెలియదు కానీ టీడీపీ పేరెత్తితే చాలు జీవన్ రెడ్డి మొహం అదోలా పెడుతున్నారట. మేమేంటి టీడీపీతో కలవడమేంటన్నట్లుగా ఆయన మండిపడుతున్నట్లు సమాచారం. ఏమైనా ఆరోపించండి కానీ... టీడీపీతో మిలాఖత్ అయ్యామని మాత్రం అనొద్దని ఆయన ఘాటుగా చెప్పినట్లు సమాచారం.

టీఆర్ ఎస్ నేతలు వాస్తవాలను వక్రీకరిస్తూ తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని జీవ‌న్‌ రెడ్డి మండిపడ్డారు. ఈ రోజు హైద‌రాబాద్‌ లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టీడీపీతో కలిసింద‌ని ప్రచారం చేయ‌డం భావ్యం కాద‌ని... చాలా దారుణమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మల్లన్నసాగర్ నిర్వాసితుల ప‌ట్ల అన్యాయంగా వ్యవ‌హ‌రిస్తోందని, ఈ విష‌యంపైనే ప్రతిపక్షాలన్నీ క‌లిసి రైతుల‌కు సంఘీభావం తెలిపాయని ఆయన వివరణ ఇచ్చారు. ఈ విష‌యాన్ని సాకుగా చూపి తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో తమ పార్టీ క‌లిసిందనడం వ్యాఖ్యలు చేయ‌డం కరెక్టు కాదని ఆయన అన్నారు.

ఓటుకు నోటు కేసులో క్విడ్ ప్రోకో జరిగిందని జీవ‌న్‌ రెడ్డి ఈ సంద‌ర్భంగా ఆరోపించారు. పట్టిసీమను - పోలవరాన్ని కేసీఆరే సమ‌ర్థించార‌ని విమర్శించిన ఆయన టీడీపీతో టీఆరెస్ కే సంబంధాలున్నాయన్నట్లుగా పరోక్ష విమర్శలు చేశారు.