Begin typing your search above and press return to search.
ట్యాపింగ్ కేసు ఏపీలో పెట్టకూడదంట
By: Tupaki Desk | 23 Jun 2015 10:57 AM GMTట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రమేయం ఉందా? లేదా? అన్న విషయంపై ఒక స్పష్టత రాని విషయం తెలిసిందే. ట్యాపింగ్ ఉదంతంపై ఏపీలో విచారణ సాగుతున్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత జీవన్‌రెడ్డి ఒక కొత్త వాదనను తీసుకొచ్చారు.
హైదరాబాద్‌లో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులను ఆంధ్రప్రదేశ్‌లో ఫైల్ చేస్తే చెల్లవని ఆయన వాదిస్తున్నారు. ట్యాపింగ్ చేసింది హైదరాబాద్‌లో అయితే కేసులు ఏపీలో ఎలా వేస్తారన్నది ఆయన ప్రశ్నగా ఉంది. ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే ఆ ఫిర్యాదు ఏపీ ప్రభుత్వం హైదరాబాద్ పోలీసులకే ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు. నేరం చేసిన వారికే.. నేరం జరిగిందని ఫిర్యాదు ఇవ్వటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందన్న విషయం జీవన్‌రెడ్డికే తెలియాలి.
మరోవైపు.. హైదరాబాద్‌లో రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులకు సమానమైన అధికారాలు ఉంటాయని అటార్నీ జనరల్ సలహా ఇచ్చిన నేపథ్యంలో జీవన్‌రెడ్డి మాటపై పలు సందేహాలు వ్యక్తం కావటం ఖాయం. సెక్షన్ 8ను కూడా ప్రస్తావించిన జీవన్‌రెడ్డి హైదరాబాద్‌లో శాంతిభద్రతల అంశం తెలంగాణ ప్రనభుత్వానిదే అని ఆయన స్పష్టం చేస్తున్నారు. సెక్షన్ 8లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన రాలేదని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి సెక్షన్ 8 విషయంలో తెలంగాణ అధికారపక్షానికి.. తెంగాణ కాంగ్రెస్ కూడా మద్ధతు ఇచ్చినట్లుగా జీవన్‌రెడ్డి వ్యాఖ్యల్ని చూస్తే స్పష్టమవుతోంది.