Begin typing your search above and press return to search.
టీ కాంగ్రెస్ కు కొత్త ఆశగా మారిన జగన్!
By: Tupaki Desk | 13 Jun 2019 10:51 AM GMTమొన్నటివరకు పట్టని జగన్ ఇప్పుడు వారి పాలిట దేవుడిలా మారాడు. మనసులో ఉన్నది మాట రూపంలోకి వచ్చినట్లుగా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్త ఆశగా మారాడు. ఎంతైనా జగన్ తమ వాడే అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు కాంగ్రెస్ నేతల్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఏపీలో జగన్ సాధించిన సంచలన విజయం వారిలో కొత్త ఆశలు పుట్టేలా చేయటమే కాదు.. జగన్ జపం అంతకంతకూ పెంచుతున్న వారి తీరు ఇప్పుడు కొత్త ఆసక్తిగా మారిందని చెప్పాలి.
జగన్ పేరును అదే పనిగా ప్రస్తావిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతల నోటి నుంచి ప్రతి విషయంలోనూ ఆయన ప్రస్తావన తీసుకొస్తున్నారు. జగన్ మాదిరి కష్టపడితే తెలంగాణలో కాంగ్రెస్ కు వంద సీట్లు ఖాయమని ఒక కాంగ్రెస్ నేత వ్యాఖ్యానిస్తే.. జగన్ లా ప్రజల్లోకి వెళితే వచ్చే ఎన్నికల్లో తమదే అధికారమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక.. మరో సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్ ను చూసి కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలంటున్నారు. విద్యా రంగం మీద జగన్ పెడుతున్న దృష్టిని పెట్టాలని.. సంక్షేమ పథకాల విషయంలో జగన్ విజన్ ను చూసైనా నేర్చుకోవాలని తిట్టి పోస్తున్నారు. ఏరకంగా చూసినా జగన్ తమ ఆత్మబంధువుగా ఫీలవుతున్న తీరు తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
జగన్ లాంటి సీమాంధ్ర నేత ప్రస్తావన తెస్తే తెలంగాణ సెంటిమెంట్ ఏం కావాలన్న దానికి సొల్యూషన్ ఆలోచించేశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ ను పల్లెత్తు మాట అనేందుకు కేసీఆర్ ఇష్టపడరు. అలాంటప్పుడు జగన్ ప్రస్తావన తీసుకురావటం ద్వారా.. కేసీఆర్ ను ఇరుకున పడేసేలా విమర్శించే అవకాశం ఉందంటున్నారు.
అదే సమయంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై తెలంగాణ సమాజంలోనూ ఉత్సాహం.. ఉత్సుకత అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ జపం ద్వారా తమకు మైలేజే తప్పించి.. నష్టం జరిగే ప్రమాదం లేదన్న మాట కాంగ్రెస్ నేతల నోటి నుంచి వస్తోంది. అంతేకాదు.. జగన్ జపంతో ఒక బలమైన సామాజిక వర్గం ఒక కట్టుమీదకు వచ్చే వీలుందన్న ఆశలోనూ టీ కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి జగన్ జపం టీ కాంగ్రెస్ కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పక తప్పదు.