Begin typing your search above and press return to search.
ఫ్రంట్ పెడతానని చెప్పి మోడీ ఫ్రంట్ లో చేరుడేంది సారూ?
By: Tupaki Desk | 13 Dec 2020 12:30 PM GMTరాజకీయాల్లో టైమింగ్ కు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అదే పనిగా విమర్శలు చేయటం.. విరుచుకుపడటం వల్ల పెద్దగాప్రయోజనం ఉండదు. గురి చూసి కొట్టినట్లుగా.. టైం చూసుకొని.. పరిస్థితులు అనుకూలంగా ఉన్న వేళ చేసే విమర్శకు వచ్చే మైలేజీ అంతా ఇంతా కాదు. తాజాగా అలాంటి పనే చేశారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత.. ఫైర్ బ్రాండ్ జీవన్ రెడ్డి. కేంద్రంలోని మోడీ సర్కారుకు వ్యతిరేకంగా సొంత కూటమి ఏర్పాటు చేస్తానని చెప్పిన అంశాన్ని గుర్తు చేస్తూ.. జీవన్ రెడ్డి పదునైన విమర్శలు చేశారు.
గ్రేటర్ ఎన్నికలకు ముందు బీజేపీని విమర్శించిన కేసీఆర్.. ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి పెరిగిన దూరాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయటాన్ని తప్పు పట్టారు. ‘‘ఎన్నికల తర్వాత ఫెడరల్ ఫ్రంట్ పెడతానన్నారు. పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పారు. అలాంటి కేసీఆర్.. ఇప్పుడు మోడీ ఫ్రంట్ లో చేరటమా?’’ అని ప్రశ్నించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రజల మీద రూ.3లక్షల కోట్ల అదనపు భారాన్ని మోపారన్నారు.
మోడీతో భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన కొన్ని వ్యాఖ్యలు విస్మయానికి గురి చేస్తున్నాయన్నారు. ప్రాజెక్టు పూర్తి చేసి.. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అడగటం ఏమిటన్న ఆయన.. డీపీఆర్ ఇవ్వకుండా జాతీయ హోదా అడుగుతారా? అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ఎయిర్ పోర్టు దక్కలేదని.. అలాంటిది ఆరు ఎయిర్ పోర్టులు ఎలా వస్తాయన్న ఆయన.. మొదట రోడ్ల కనెక్టివిటీ పెంచాలన్నారు.
ముందు రహదారుల సదుపాయాన్ని కల్పించి.. ఆ తర్వాత ఎయిర్ పోర్టుల గురించి మాట్లాడాలన్నారు. సిద్ధిపేట.. వరంగల్ లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి.. ఎయిర్ పోర్టు ప్రతిపాదనను తెర మీదకు తెచ్చారన్నారు. కేంద్రం నుంచినిధులు తీసుకురావటంలో కేసీఆర్ విఫలమయ్యారన్న జీవన్ రెడ్డి.. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నుంచి ఏపీ ప్రభుత్వం నీళ్లు తోడుకు పోతున్నా.. ముఖ్యమంత్రికి సోయి లేకుండా పోయిందన్నారు.