Begin typing your search above and press return to search.

నగరి కోర్టుకు జీవితా రాజశేఖర్.. ఏ కేసుకు హాజరయ్యారంటే?

By:  Tupaki Desk   |   12 Aug 2022 4:36 AM GMT
నగరి కోర్టుకు జీవితా రాజశేఖర్.. ఏ కేసుకు హాజరయ్యారంటే?
X
సీనియర్ నటి కమ్ నిర్మాత జీవితా రాజశేఖర్ తాజాగా చిత్తూరు జిల్లా నగరి కోర్టుకు హాజరయ్యారు. ఇదేకోర్టు నుంచి గతంలో ఆమెకు అరెస్టు వారెంట్ ఇష్యూ కావటం తెలిసిందే. ఒక ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఉదంతంలో చోటు చేసుకున్న వివాదానికి సంబంధించి ఆమె కోర్టుకు హాజరైనట్లు చెబుతున్నారు.

ఈ కేసుకు సంబంధించి గతంలో వారెంట్ ఇష్యూ అయిన నేపథ్యంలో ఆమె.. హైకోర్టులో రీకాల్ పిటిషన్ వేశారు. కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాల్సిన నేపథ్యంలో ఆమె.. తన న్యాయవాదితో కలిసి కోర్టుకు వచ్చారు. కోర్టుకు హైకోర్టు రీకాల్ పిటిషన్ ను న్యాయమూర్తికి సమర్పించిన ఆమె.. వారెంట్ ను రద్దు చేసుకున్నారు.

ఇంతకీ జీవితకు ఇన్ని తిప్పలుపెడుతున్న ఈ వివాదంలోకి వెళితే.. అప్పట్లో రాజశేఖర్ నటించిన గరుడ వేగ మూవీ గుర్తుంది కదా. సూపర్ హిట్ అయిన ఈ మూవీ నిర్మాణ సమయంలో నగరి నియోజకవర్గంలోని సాయి శక్తి ఇంజనీరింగ్ కాలేజీ నిర్వాహకుడు కోటీశ్వరరాజు సతీమణి హేమరావు వద్ద రూ.26 కోట్ల మొత్తాన్ని రెండుదఫాలుగా తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

దీనికి సంబంధించిన చెక్కులు బౌన్సు అయినట్లు వాదన. జీవిత ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావటంతో.. వారు తాకట్టు పెట్టిన స్థలాన్ని తమకు చెప్పకుండా వేరే వారికి అమ్మేసినట్లుగాఆరోపిస్తూ.. తమిళనాడులోని తిరువళ్లూరు కోర్టులో.. నగరి కోర్టులోనూ రెండు కేసులు వేశారు.

ఈ కేసులకు సంబంధించి నగరి కోర్టు జారీ చేసిన నాలుగు వారెంట్లకు జీవిత రాజశేఖర్ హాజరు కాలేదు. దీంత.. కోర్టు ధిక్కార ఆరోపణలతో కోర్టు రెండునెలల క్రితం అరెస్టు వారెంట్ జారీ చేశారు.

ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించిన జీవిత.. అక్కడి నుంచి ఉత్తర్వులు తీసుకొని ఆమె తాజాగా నగరి కోర్టుకు ప్రత్యక్షంగా హాజరయ్యారు. తనపై జారీ చేసిన అరెస్టు వారెంట్ ను రద్దు చేసున్నారు. ఇక.. ఈ మొత్తానికి కారణమైన ఆర్థిక వివాదానికి సంబంధించిన కోర్టు కేసు మాత్రం ఇంకా నడుస్తూనే ఉంది.