Begin typing your search above and press return to search.
వాణీ కాదు జీవితను ట్రాక్ మీదకు తెస్తున్నారా?
By: Tupaki Desk | 15 Nov 2017 9:00 AM GMTఅధికారంలో ఉన్న తెలుగుదేశానికి అన్ని హంగులు ఉన్నాయని చెబుతారు కానీ.. ఫైర్ బ్రాండ్ నేతల కొరత మాత్రం భారీగా ఉంది. విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక్క రోజా పది మంది టీడీపీ నేతలకు పెట్టు. రోజాకు ధీటైన ఫైర్ బ్రాండ్‌ను తయారు చేసుకోవాలని టీడీపీ అధినాయకత్వం ఎప్పటి నుంచో భావిస్తోంది. కానీ.. సరైనోళ్లు దొరకని పరిస్థితి. ఇలాంటి వేళలో ఎంట్రీ ఇచ్చారు.. ఏళ్ల క్రితం సినిమాల్ని వదిలేసి ఎక్కడుందో తెలీని వాణీవిశ్వనాధ్.
రావటం రావటమే టీడీపీ మీద తనకున్న అభిమానాన్ని పొంగి పొర్లేలా మాటలు చెప్పేసిన ఆమె.. తెలుగు ప్రజలు.. అందునా ఆంధ్రోళ్లంటే ఎంత ఇష్టమో చెప్పుకొచ్చింది. విభజన వేళ.. ఏపీ నష్టపోతున్న వేళ.. వీళ్లంతా మాటలు రాని వాళ్ల మాదిరి ఎందుకు ఉండిపోయారో అన్న ఆలోచన వస్తే మాత్రం బలవంతంగా అణగదొక్కేయండి.
వాణీ తెర మీదకు రాగానే తెలుగు తమ్ముళ్లకో ధీమా వచ్చేసింది. సినీ గ్లామర్ తో పాటు.. రోజా మాదిరి కడిగేసేలా మాట్లాడేస్తానన్న సంకేతాలు ఇవ్వటంతో సరైన జోడి దొరికిందని సంతసించినోళ్లే ఎక్కువ. 2019 ఎన్నికల్లో నగరి బరిలో నుంచి వాణీని దింపితే నా సామిరంగా.. రోజాకు చుక్కలు పక్కా అని లెక్కలేసుకున్నోళ్లు ఉన్నారు.
ఇలాంటి వేళ.. ఉన్నట్లుండి సీన్లోకి వచ్చేశారు జీవిత రాజశేఖర్. గడిచిన కొంతకాలంగా కాలం కలిసి రాని ఆమె ఇప్పుడు కొత్త ఉత్సాహంతో ఉన్నారు. ఊహించిన దాని కంటే గరుడ వేగ విజయం జీవిత రాజశేఖర్ ఫ్యామిలీలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నిజానికి జీవితకు తెలుగుదేశం కొత్తేం కాదు. సైకిల్ ఎక్కి దిగేసి.. ఆ తర్వాత వైఎస్ హయాంలో అభయహస్తం నీడన ఉన్న ఆమె తర్వాతి కాలంలో కమలంతో దోస్తీకి తెగ ట్రై చేశారు. అంతిమంగా మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో సైకిల్‌కు మించిన సేఫ్ గేమ్ మరొకటి లేదని డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు.
దీంతో.. టీడీపీకి దగ్గరయ్యేందుకు ఆమె ప్రయత్నాలు షురూ చేశారు. జీవిత గురించి తెలుగోళ్లకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మాంచి మాటకారి.. విషయాన్ని ఎప్పుడు ఎలా డీల్ చేయాలో ఆమెకు బాగానే తెలుసు. దూసుకెళ్లే ధోరణిలో జీవితకుతిరుగులేదు. ఎప్పుడైతే జీవిత సీన్లోకి వస్తున్నారో వాణీ వ్యవహారం ఇప్పుడు ప్రశ్నగా మారింది. నగరి సీటుకు వాణీ.. జీవితల విషయానికి వస్తే జీవితనే బెటర్ అన్న మాట టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. నగరి ఎంపిక మాట ఎలా ఉన్నా.. ఒక్క ఫైర్ బ్రాండ్ అయినా దొరికితే చాలన్న తెలుగు తమ్ముళ్ల మొరను దేవుడు బాగానే విన్నట్లున్నాడు. ఒకరేంటి.. ఇద్దరు లేడీ ఫైర్ బ్రాండ్ లు టీడీపీ తరఫు ఉండటం ఖాయమని చెబుతున్నారు. మరి.. కొత్త ఫైర్ బ్రాండ్లను ఎదుర్కొవటానికి రోజా ఎలాంటి అస్త్రాలు సిద్ధం చేసుకుంటారో చూడాలి.