Begin typing your search above and press return to search.
ప్రపంచ కుబేరుడు కొన్న ఇంటి ధర ఎంతో తెలుసా?
By: Tupaki Desk | 14 Feb 2020 1:30 AM GMTప్రపంచ కుబేరుల్లో ఒకరుగా చెప్పే అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. నిత్యం ఏదో ఒక విషయం మీద ఆయన వార్తల్లో కనిపిస్తూనే ఉంటారు. వ్యాపారంలోనే కాదు.. వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లో హెడ్ లైన్స్ లో ఉండటం ఆయనకు మాత్రమే చెల్లుతుందేమో? దీర్ఘకాలం వైవాహిక బంధంలో ఉండి.. ఈ మధ్యనే విడాకులు తీసుకొని గర్ల్ ఫ్రెండ్ లౌరెన్ సాంచెజ్ తో విలాసంగా గడుపుతున్న ఆయన.. ఇటీవల కాలంలో భారీగా షాపింగ్ చేస్తున్నాడు.
ఒక పాతకాలం నాటి విలాసవంతమైన భవనాన్ని తాజాగా బెజోస్ కొనుగోలు చేసినట్లుగా వాల్ స్ట్రీట్ జర్నల్ తాజాగా పేర్కొంది. ఆ మీడియా సంస్థ అచ్చేసిన కథనం ప్రకారం సదరు ఇంటి విలువ ఏకంగా రూ1150 కోట్లు కావటం విశేషం. లాస్ ఏంజెల్స్ లోని బెవర్లీ హిల్స్ లో ఈ విలాసవంతమైన భవనం ఉంది. ఇంత భారీ ధర పలకటం ఇదే తొలిసారి అన్న మాట వినిపిస్తోంది.
1930లలో హాలీవుడ్ చిత్రం టైటాన్ జాక్ వార్నర్ కోసం రూపొందించిన ఈ భవనాన్ని 1992లో ఆర్కిటిపాల్ స్టూడియో మొఘల్ ఎస్టేట్ గా అభివర్ణిస్తారు. ఈ భవనంలో జార్జియన్ స్టైల్లో విస్తారమైన టెర్రెస్ లతో పాటు భారీ గోల్ఫ్ కోర్టులు ఉన్నాయి. 1990 నుంచి ఈ విలాసవంతమైన భవనం డేవిడ్ జెఫెన్ అధీనంలో ఉండగా.. తాజాగా అమెజాన్ అధిపతి ఈ భవనాన్ని కొనుగోలు చేశారు. ఇటీవల కాలంలో తన గర్ల్ ఫ్రెండ్ లో కలిసి విపరీతమైన షాపింగ్ చేస్తున్న బెజెస్ కు ఇప్పటికే పలు ఇళ్లు ఉన్నాయి.