Begin typing your search above and press return to search.
200 కోట్ల డాలర్లు విరాళం ప్రకటించిన జెఫ్ బెజోస్ మాజీ భార్య !
By: Tupaki Desk | 16 Jun 2021 11:31 AM GMTఆమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బేజోస్ మాజీ భార్య మెకంజీ స్కాట్ మరో భారీ విరాళం చేశారు. తాజాగా ఆమె సుమారు 200 కోట్ల (2.7 బిలియన్ల డాలర్ల) డాలర్ల మొత్తాన్ని వివిధ ఛారిటీలకు అందజేశారు. తన బ్లాగ్ పోస్టులో ఆమె ఈ విషయాన్ని చెప్పారు. ఎన్నాళ్లుగానో ఫండింగ్ కు నోచుకోని, పట్టించుకోని, స్వచ్ఛంద సేవా సంస్థలకు తన సంపదను దానం చేసినట్లు మెకంజీ స్కాట్ తెలిపారు. వర్ణ అసమానతలు, కళలు, విద్యా రంగాల కోసం పనిచేస్తున్న సుమారు 286 సంస్థలకు తన డబ్బును విరాళం ఇచ్చినట్లు ఆమె చెప్పారు. చారిత్రాత్మకంగా అణగారిన, నిరాదరణకు గురైన వర్గాలు, సంఘాలకు ఈ నిధులను అందించనున్నట్టు ఒక బ్లాగ్‌లో ఆమె ప్రకటించారు. దీంతో గత ఏడాది జులై అందించిన సాయంతో పాటు మాకెంజీ విరాళాల మొత్తం విలువ 8.5 బిలియన్ డాలర్లు చేరింది.
జెఫ్ బేజోస్ తో 2019లో ఆమె విడాకులు తీసుకున్నారు. ఆ విడాకుల ద్వారా వచ్చిన భరణం వేల కోట్లల్లో ఉన్నది. దాంతో ఆమె ప్రపంచ సంపన్నురాలిగా మారింది. బేజోస్ తో జరిగిన ఒప్పందం ప్రకారం, అమెజాన్ షేర్లు నాలుగు శాతం స్కాట్ కు దక్కాయి. 1994లో అమెజాన్ సంస్థ ఏర్పాటు విషయంలో బేజోస్ కు మెకంజీ స్కాట్ తోడ్పడ్డారు. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం 59.5 బిలియన్ల డాలర్ల సంపదతో.. ప్రపంచ కుబేరుల జాబితాలో ఆమె 22వ స్థానంలో ఉన్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు 2019 లో విడాకులిచ్చి, డాన్ జ్యువెట్‌ను వివాహం చేసుకున్న తర్వాత ఇంత పెద్దమొత్తంలో విరాళాలు ప్రకటించడం ఇదే తొలిసారి. దీంతో విరాళాలను స్వీకరించిన సంస్థు సంతోషాన్ని ప్రకటించాయి. కాగా మాకెంజీ దానం విలువ కొన్ని దేశాల మొత్తం జిడిపి కంటే ఎక్కువ. మరో బిలియనీర్,పరోపకారి బిల్, మెలిండా గేట్స్ గత 27 సంవత్సరాల్లో సుమారు 50 బిలియన్ డాలర్ల విరాళం ఇవ్వగా స్కాట్ కేవలంలో 12 సంవత్సరాలలో ఆ మొత్తాన్ని సాధించడం విశేషం.