Begin typing your search above and press return to search.

ప్రియురాలితో మాట్లాడినందుకు వార్నింగ్ ఇచ్చిన అమెజాన్‌ అధినేత !

By:  Tupaki Desk   |   11 Nov 2021 1:30 AM GMT
ప్రియురాలితో మాట్లాడినందుకు వార్నింగ్ ఇచ్చిన అమెజాన్‌ అధినేత !
X
ప్రముఖ వ్యాపార సంస్థ అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్ ఇటీవల హాలీవుడ్‌ హీరో లియోనార్డో డికాప్రియో ను ఓ కార్యక్రమంలో కలిశారు. ఆ కార్యక్రమంలో తన ప్రియురాలు, డికాప్రియో కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌ గా మారడంతో జెఫ్‌ బెజోస్‌ ట్విటర్‌ వేదికగా బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే , అమెజాన్ అధినేత అతనికేం సీరియస్ వార్నింగ్ ఇచ్చి , సినిమాల్లో లాగా రౌడీలని పంపలేదు. కామెడీగా వార్నింగ్ ఇచ్చారు.

అసలు ఈ వ్యవహారం లో కీలకమైన అంశం ఏమిటి అంటే .. గత శనివారం అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌ లో జరిగిన లాక్మే ఆర్ట్‌ ఫిల్మ్‌ గాలా ఈవెంట్ కి అమెజాన్‌ అధినేత తన ప్రియురాలు లారెన్‌ సాంచెజ్‌ తో కలిసి హాజరయ్యారు. అదే వేడుకకు డికాప్రియో కూడా వచ్చారు. ఆ కార్యక్రమంలో డికాప్రియో, లారెన్‌ సాంచెజ్‌ కాసేపు ఏదో విషయమై సంభాషించుకున్నారు. దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

దీంతో ఈ వీడియో పై బెజోస్‌ ఫన్నీగా స్పందిస్తూ ట్వీట్ చేశారు. అందులో.. ప్రమాదం ఏటవాలుగా ఉన్న కొండ ప్రాంతం అని హెచ్చరిక బోర్డును పట్టుకొని చొక్కా లేకుండా తాను దిగిన ఓ ఫొటోను ఆ వీడియోకు జత చేస్తూ..లియో ఇక్కడకు రా, నీకొకటి చూపించాలి అంటూ బెజోస్‌ ఓ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరలయ్యింది. ఇప్పటికే దానిని 17 మిలియన్ల వ్యూస్ రాగా, 1.4 లక్షల లైకులు వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు పలురకాలుగా రియాక్ట్ అవుతూ , కామెంట్స్ చేస్తున్నారు.