Begin typing your search above and press return to search.

అప‌ర‌కుబేరుడి ఫ్యూచ‌ర్ ప్రాజెక్టు బ‌య‌ట‌కొచ్చేసింది!

By:  Tupaki Desk   |   11 May 2019 4:34 AM GMT
అప‌ర‌కుబేరుడి ఫ్యూచ‌ర్ ప్రాజెక్టు బ‌య‌ట‌కొచ్చేసింది!
X
అంత‌రిక్షం. అందులో మాన‌వ కాల‌నీలు. ప్రాక్టిక‌ల్ గా ఎప్ప‌టికి సాధ్య‌మ‌న్న‌ది ప‌క్క‌న పెడితే.. ఆ ఐడియాతో ఇప్ప‌టికే బోలెడ‌న్ని హాలీవుడ్ సినిమాలు వ‌చ్చాయి. బాలీవుడ్ లోనూ కొద్ది సినిమాలు వ‌చ్చాయి. రీల్ క‌థ‌.. రియ‌ల్ కావ‌టం అంత తేలికైన విష‌యం కాదు. కానీ.. ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌నికుడు.. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ లాంటి వ్య‌క్తి సీరియ‌స్ గా తీసుకుంటే.. అది బ్లూమూన్ ప్రాజెక్టు కావ‌టం ఖాయం.

సాంకేతిక ఉప‌క‌ర‌ణాల‌తో పాటు.. మ‌నుషులు చంద్రుడిపైకి పంపి.. అక్క‌డ మాన‌వ కాల‌నీలు త‌యారు చేయాల‌న్న ఆయ‌న ఆలోచ‌న‌ల‌కు ప్ర‌తిరూపం తాజా బ్లూమూన్ ప్రాజెక్టు. దీనికి సంబంధించిన వివ‌రాల్ని తాజాగా ఆయ‌న ప్ర‌క‌టించారు. మ‌రో ఐదేళ్ల‌లో ఈ ప్రాజెక్టు ఫైన‌ల్ స్టేజ్ కి వ‌చ్చేసి.. చంద్రుడి మీద‌కు మ‌నుషుల్ని.. సాంకేతిక సామాగ్రిని పంప‌నున్న‌ట్లుగా తాజాగా ప్ర‌క‌టించారు.

గ‌తంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన చంద‌మామ మీద మ‌నుషుల ఆవాసాల మాట‌ను అమెజాన్ అధినేత నిజం చేస్తామ‌ని చెబుతున్నారు. చంద్రుడిపై నిర్మించే మాన‌వ‌కాల‌నీల న‌మూనాల్ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌ద‌ర్శించ‌టం మ‌రో విశేషం. చంద్రుడి ద‌క్షిణ ధృవంలో తాము త‌యారు చేసే వాహ‌నాన్ని దింపాల‌ని భావిస్తున్న‌ట్లు చెప్పారు.

బ్లూ ఆరిజిన్ పేరుతో బెజోస్ 2000లో ఈ కంపెనీని స్థాపించారు. ప్ర‌తి ఏటా బిలియ‌న్ డాల‌ర్లు (దాదాపుగా 7 వేల కోట్ల రూపాయిల‌కు కాస్త త‌క్కువ‌) ఖ‌ర్చు చేస్తున‌నారు. భూమి మీద కాలుష్యం వెద‌జ‌ల్లే ప‌రిశ్ర‌మ‌ల్ని చంద్రుడి మీద‌కు త‌ర‌లించ‌టం బెజోస్ ల‌క్ష్యం. దీనికి తోడు మ‌నుషుల‌కు కాల‌నీలు నిర్మించాల‌న్న‌ది కూడా ఆయ‌న ఆలోచ‌న‌. చంద్రుడిపైకి పంపే బ్లూ మూన్ ల్యాండ‌ర్ వాహ‌నం బ‌రువు మూడు మెట్రిక్ ట‌న్నుల బ‌రువు ఉంటుంది. 15 ట్యాంకుల్లో ఇంధ‌నం నింపొచ్చు.

భూమి నుంచి బ‌య‌లుదేరిన‌ప్ప్ఉడు వాహ‌నం 33వేల పౌండ్ల బ‌రువు ఉంటుంది. ఇంధ‌న వినియోగం కార‌ణంగా చంద్రుడి మీద‌కు దిగేస‌రికి ఇంధ‌నం త‌గ్గి 7వేల పౌండ్లే మిగులుతుంది. ఈ వాహ‌నం ద్వారా 3.6 ట‌న్నుల బరువును చంద‌మామ‌పైకి చేర్చ‌వ‌చ్చు. న‌మూనాలో మార్పులు చేస్తే 6.5 ట‌న్నులు తీసుకెళ్లే వీలుంది. నాలుగు ఇనుప కాళ్ల మీద ఇది నిల‌బ‌డి ఉంటుంది. గుండ్రంగా ఉండే ఈ డెక్ పై భాగంలో ఉప‌క‌ర‌ణాలు.. మ‌ధ్య‌లో పెద్ద ట్యాంకులో నైట్రోజ‌న్ ఇంధ‌నాన్ని ఉంచుతారు. మ‌రి.. అమెజాన్ అధినేత అమేజింగ్ ప్రాజెక్టు ఎలాంటి ఫ‌లితం ఇస్తుంద‌న్న‌ది చూడాలంటే మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు.