Begin typing your search above and press return to search.

మసూద్ బతికే ఉన్నాడు.. పాక్ మీడియా

By:  Tupaki Desk   |   4 March 2019 5:54 AM GMT
మసూద్ బతికే ఉన్నాడు.. పాక్ మీడియా
X
భారత్ లో పుల్వామా ఉగ్రదాడితో 43మంది భారత సైనికులను హతమార్చిన పాకిస్తాన్ ఉగ్రవాది - జైషే అహ్మద్ అధినేత మసూద్ అజాహర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా మార్చాలని భారత్ పోరాడుతోంది. ఇందులో భాగంగా జైషే ఉగ్రవాద శిబిరాలను ఇటీవలే భారత వాయుసేన దాడి చేసి గట్టి సమాధానం చెప్పింది. ఇంటా, బయటా పాకిస్తాన్ నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో పాకిస్తాన్ ‘మసూద్ అజార్’ ఆరోగ్యం బాగాలేదని.. అతను చనిపోయాడంటూ కొత్త నాటకాలు మొదలు పెట్టింది.

అయితే పాకిస్తాన్ ఉగ్రవాది మసూద్ చనిపోయాడంటూ చెబుతున్న విషయం అవాస్తవమని పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. మసూద్ అజార్ మరణించలేదని.. ఆయన సజీవంగా ఉన్నాడని పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. మసూద్ మరణించాడన్న ప్రచారం అవాస్తవమని జియో ఉర్దూ న్యూస్ పేర్కొంది. కాలేయ క్యాన్సర్ తో మసూద్ మరణించాడని వస్తున్న వార్తలు అవాస్తవాలని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నట్టు జియో న్యూస్ తెలిపింది.

మసూద్ పరిస్థితిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడికాలేదని.. ఏం జరిగిందో తనకు తెలియదని పాక్ సమాచార మంత్రి ఫవాద్ చౌదరి పేర్కొన్నారు. ఇక ఆర్మీ ఆస్పత్రిలో మసూద్ చికిత్సపొందాడన్న దానిపై తమకు ఎలాంటి సమాచారం లేదని భారత అధికారులు స్పష్టం చేశారు.

ఇక పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషి మసూద్ అనారోగ్యంతో ఇంటికే పరిమితమయ్యాడని ప్రకటించడంతో ఈ కరుడు గట్టిన ఉగ్రవాది పాక్ లోనే ఉన్నాడని పాకిస్తాన్ నిర్ధారించినట్లైంది. పాకిస్తాన్ తొలిసారి మసూద్ తమ దేశంలోనే ఉన్నాడని తెలుపడంతో ప్రపంచ దేశాలు దీనిపై ఆగ్రహంగా ఉన్నాయి.