Begin typing your search above and press return to search.
మత్తయ్య దొరికాడు : జగన్ పై సంధించారు!
By: Tupaki Desk | 2 Sep 2016 10:44 AM GMTచంద్రబాబునాయుడు మీద ఏసీబీ కోర్టులో వైకాపా ఎమ్మెల్యే కేసు పెట్టడం - దాని ద్వారా చంద్రబాబు ఓటుకు నోటు పాపం గురించి ప్రజల్లో బహుధా చర్చ జరగడం అనేది తెలుగుదేశం పార్టీ వారికి చాలా అసహనం కలిగిస్తూ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదనేది జనంలో ఉన్న అభిప్రాయం. దాన్ని తట్టుకోలేక.. చంద్రబాబునాయుడు చాలా గొప్పవాడని, జగన్ ది జైలు కెళ్లిన చరిత్ర అని.. వైకాపా నేరగాళ్ల పార్టీ అని.. ఇలా ఆ పార్టీలో మంత్రి పదవుల కోసం ఎదురుచూస్తున్న నాయకులందరూ కూడా వరుసపెట్టి ప్రకటనలు గుప్పిస్తూ, చంద్రబాబునాయుడు దృష్టిలో పడడానికి ప్రయత్నించారు. అయితే వారికి ఇది సరిపోలేదు. ఇంకా ఏదో చేయాలి.. జగన్ మీద ఇంకా బురద చల్లాలి.. అనిపించినట్లుంది. అందుకే తెరమీదికి మళ్లీ జెరూసలెం మత్తయ్య వచ్చారు.
జెరూసలెం మత్తయ్య ఈ ఓటుకు నోటు వ్యవహారంలో చాలా కీలకమైన వ్యక్తి అనే సంగతి అందరికీ తెలుసు. ఆయనకు తెలంగాణ ప్రభుత్వానికి మధ్య కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉంది. అక్కడ ఆయన విచారణకు హాజరవుతున్నారు. అలా వెళ్లిన సందర్భంలో.. కొన్ని రోజుల కిందట డిల్లీలో మాట్లాడుతూ చంద్రబాబు వల్ల తనకు ప్రాణహాని ఉన్నదని ఆయన చెప్పారు. ఈకేసు వల్ల నాకేమీ కాకుండా.. నాకేం అవసరమున్నా చూసుకుంటామని తెలుగుదేశం వాళ్లు చెప్పారని తర్వాత పట్టించుకోవడం లేదని చెప్పారు.
అయితే రెండు రోజుల్లోనే ప్లేటుమారింది. హైదరాబాదుకు వచ్చి.. తనమీద తెలంగాణ ఏసీబీ సుప్రీం కోర్టులో అప్పీలుకు వెళితే.. అది జగన్ ప్రోద్బలంతోనే జరిగిందని మత్తయ్య ఆరోపణలు గుప్పించారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వాన్ని జగన్ ఇన్ ఫ్లుయెన్స్ చేస్తున్నాడనేది మత్తయ్య ఆరోపణ. ఏసీబీ కోర్టులో తాజా కేసు విచారణే గనుక జరిగితే.. మత్తయ్య కూడా కీలకం కాబోతున్న నేపథ్యంలో ఆయన తెరమీదకు వచ్చి జగన్ ను ఈ వివాదంలోకి లాగడం చిత్రమైన పరిణామంఅని ప్రజలు అనుకుంటున్నారు. . తెలుగుదేశం వారికి దిక్కు తెలియక ఎవరు దొరికితే వారితో జగన్ మీద బురద చల్లించే ప్రయత్నం చేస్తున్నారని జనం అనుకుంటున్నారు.