Begin typing your search above and press return to search.

ఇద్దరి చంద్రుళ్లపై మత్తయ్య ఫైరింగ్

By:  Tupaki Desk   |   22 Aug 2016 9:11 AM GMT
ఇద్దరి చంద్రుళ్లపై మత్తయ్య ఫైరింగ్
X
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య.. ఇద్దరు చంద్రుళ్ల మధ్య విపరీతమైన పొలిటికల్ హీట్ జనరేట్ చేసిన ఉదంతం ఓటుకు నోటు. ఈ ఇష్యూలో ఇద్దరి చంద్రుళ్ల మధ్య పెరిగిన దూరం అంతాఇంతా కాదు. ఈ వ్యవహారంలో నిందితుడైన జెరుసలేం మత్తయ్య తాజాగా గళం విప్పారు. నిన్నటి వరకూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఏమీ అనని ఆయన.. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంచలనం సృష్టించిన ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఓటుకు నోటు కేసులో నిందితుడైన మత్తయ్య తనకు ఏమైనా జరిగితే దానికి తొలి ముద్దాయి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అని.. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బాధ్యుడేనని వ్యాఖ్యానించటం గమనార్హం. తన కుటుంబానికి ప్రాణహాని ఉందన్న ఆయన.. చంద్రబాబు తనను అవసరానికి వాడుకున్నారన్నారు. ‘‘నీకేం కాదు.. నేను ఉన్నాను’’ అని చంద్రబాబు తనతో చెప్పారని.. ఇప్పుడు తనను పట్టించుకోవటం లేదన్నారు. ఓటుకు నోటుకేసులో తాను అమాయకుడిగా అభివర్ణించుకున్నారు.

తెలుగుదేశం.. టీఆర్ ఎస్ లు.. ఏపీ.. తెలంగాణ ప్రభుత్వాల మధ్య నడుస్తున్న రాజకీయ చదరంగంలో తనను పావును చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసిన మత్తయ్య.. తనను ఇరువురు బలిపశువును చేశారన్నారు. ఇద్దరు చంద్రుళ్లు రాజకీయాలకే పరిమితం కాకకుండా తనలాంటి సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తనను ముద్దాయిని చేసే ప్రయత్నం చేస్తున్నారని.. చంద్రబాబు ఏం కాదంటూ తనకు ధైర్యం చెప్పారని.. ఇద్దరూ కలిసి తన పరిస్థితి అగమ్యగోచరంగా మార్చారన్నారు. ఈ అంశంపై ప్రజలే తీర్పు ఇవ్వాలన్నారు. కేసీఆర్.. చంద్రబాబులకు భయపడి తాను ఢిల్లీలో ఉన్నట్లు చెప్పిన మత్తయ్య.. జాతీయమానవ హక్కుల కమిషన్ లో తానుపిటీషన్ వేశానని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రజల తీర్పు కావాలంటున్న మత్తయ్య.. తాను చేసే ప్రతి పనిని ప్రజల్ని అడిగే చేశారా..? అంతా బాగున్నప్పుడు గుర్తుకు రాని ప్రజలు ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చినట్లు..?