Begin typing your search above and press return to search.

అమెరికాలో జీస‌స్ విగ్ర‌హం ధ్వంసం..క‌ల‌క‌లం

By:  Tupaki Desk   |   23 Feb 2017 11:57 AM GMT
అమెరికాలో జీస‌స్ విగ్ర‌హం ధ్వంసం..క‌ల‌క‌లం
X
అమెరికాలో మ‌త ఉద్రిక్త‌త‌లు ప్రారంభం అయిన‌ట్లుగా క‌నిపిస్తోంది. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే గుర్తు తెలియ‌ని వ్య‌క్త‌లు ఏసు క్రీస్తు విగ్రహన్ని రెండు సార్లు ధ్వంసం చేశారు. ఇండియానా రాష్ట్ర రాజ‌ధాని ఇండియానా పోలీస్‌ లోని ఓ చ‌ర్చిలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. విగ్రహంలోని జీసెస్ త‌ల‌ను న‌రికేశారు. వారం రోజుల్లోనే క్రీస్తు త‌ల‌ను రెండు సార్లు తొలిగించారు. కాటేజ్ ఎవెన్యూ పెంటకోస్టల్ ఫెల్లోషిప్ చర్చిలో ఈ ఘటన జరిగింది.

రెండు వారాల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు జీసెస్ విగ్రహానికి చెందిన తలను నరికేశారు. అయితే దుండగులు అప్పుడు ఆ తలను అక్కడే వదిలివెళ్లారు. దాంతో అక్కడ ఉన్న సిబ్బంది మళ్లీ జీసెస్ తలను స్థూపానికి అతికించారు. తలను అతికించిన మరుసటి రోజే మళ్లీ గుర్తుతెలియని వ్యక్తులు ఆ తలను మాయం చేశారు. ప్రస్తుతం జీసెస్ విగ్రహం తల లేకుండానే ఉంది. స్థానిక చర్చి అధికారులు ఇంకా దీనిపై ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోయారు. ఈ వార్త దావ‌న‌లంలా వ్యాపించ‌డంతో ఇండియానా పోలీస్‌ లో క‌ల‌క‌లం రేగింది.అధికారులు ఈ ఘటనపై విచారణ చేపడుతున్నారు. నిఘా కెమెరాలు లేని కారణంగా ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు ఇబ్బందిపడుతున్నారు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఇటీవ‌లి ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఓ వ‌ర్గం వారు దురుద్దేశ‌పూర్వ‌కంగానే ఇలా చేసి ఉంటార‌ని కొంద‌రు అనుమానిస్తున్న‌ట్లు స్థానికులు మీడియాతో తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/