Begin typing your search above and press return to search.
సో లక్కీ: రన్ వే మీద జారి పడ్డా ఏమీ కాలేదు
By: Tupaki Desk | 27 Dec 2016 6:51 AM GMTవిమాన ప్రయాణం ఎంత సౌలభ్యమో.. అంత ప్రాణాంతకం. వాయువేగంతో ప్రయాణానికి అవకాశం ఉన్నప్పటికి.. ప్రాణాల ముప్పు అనుక్షణం వెంటాడుతుంటుంది. ఒక చిన్న పక్షి చాలు.. అంత పెద్ద విమానం అంతు చూడటానికి. అందుకే ఏ చిన్న పొరపాటు జరిగినా.. హడలిపోతుంటారు. సాంకేతిక లోపం తలెత్తితో చాలు వణికిపోతుంటారు. విమానం కానీ ప్రమాదానికి గురైందంటే ప్రాణహాని లేకుండా తప్పించుకునే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి.
తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. గోవాలోని డబోలిన్ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పింది. ఈ రోజు ఉదయం గోవా నుంచి ముంబయి వెళుతున్న జెట్ ఎయిర్ వేస్ కు చెందిన విమానం.. ఒక్కసారిగా ఒరిగిపోయింది. సరిగ్గా టేకాఫ్ తీసుకునే సమయంలో విమానం ఒక పక్కకు ఒరిగి.. బురదలోకి దూసుకెళ్లింది. అమితమైన వేగంతో విమానం టేకాఫ్ చేసుకునే సమయంలో జరిగిన ఈ హఠ్మాన్ పరిణామంతో విమానంలోని ఏడుగురు సిబ్బంది.. 154 మంది ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురి అయ్యారు.
బురదలోకి దూసుకెళ్లిన విమానంలో చోటు చేసుకున్న కుదుపులకు.. ఏడుగురు గాయపడగా.. విమానం నుంచి తరలిస్తున్న సమయంలో మరో 15 మందికి గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. తృటిలో తప్పిన ప్రమాదాన్ని గుర్తు చేసుకున్న ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ మధ్యాహ్నం 12.30 గంటల వరకూ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/