Begin typing your search above and press return to search.
జెట్ ఎయిర్ వేస్ ‘పైలెట్ల’ చెత్త బుద్ధి వింటే షాకే
By: Tupaki Desk | 26 Oct 2016 10:30 PM GMTట్రైన్ ఎక్కి మరో ఆలోచన లేకుండా నిద్రపోతాం. బస్సు ఎక్కినా అదే పరిస్థితి. అలానే విమానం ఎక్కినోళ్లు కూడా.. తమ జర్నీని రకరకాలుగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇక.. అలాంటి అవకాశం లేనోళ్లు భూమి భారాన్ని తామే మోస్తున్నట్లుగా ఫీలవుతుండటం కామనే. ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు చెప్పబోయేది మరొక ఎత్తు. ఇప్పటిదాకా ప్రయాణికుల కోణంలో చెప్పాం. కానీ.. ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని చదివితే.. ప్రయాణానికి రెఢీ అయిన ప్రతిసారీ కాస్త ముందు వెనుకా ఆలోచించే దుస్థితి రావటం ఖాయం.
ఇంతకీ అంతలా భయపెట్టే అంశం ఏమిటంటే.. విమానాల్ని నడిపేసే పైలెట్ల ముచ్చట వింటే షాక్ తినాల్సిందే. మిగిలిన ప్రయాణ సాధనాలకు.. విమానాలకు పెద్ద తేడా ఉంది. ఒక చిన్న పక్షి చాలు.. విమానంలో ప్రయాణిస్తున్న వారి ప్రాణాల్ని ప్రమాదంలో పడేయటానికి. ఏ మాత్రం తేడా వచ్చిన ప్రయాణికుల ప్రాణాల మీదకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. చాలామంది పైలెట్లు పూటుగా తాగేసి విధి నిర్వహణకు వచ్చేస్తుంటారు. మిగిలిన దేశాల్లో పైలెట్ల సంగతి పక్కన పెడితే.. భారతదేశానికి చెందిన పైలెట్లను విమానం ఎక్కే ప్రతిసారీ వారు మద్యం సేవించారా? లేదా? అన్నది పరీక్షించాకే విమానాన్ని నడపటానికి అనుమతిస్తుంటారు. ఇన్ని తనిఖీలు ఉన్నా.. మందుబాబు పైలెట్లు కొందరు బరితెగించి.. తనిఖీల డేగకన్నును తప్పించుకోవాలన్న ప్రయత్నంలో దొరికిపోయే పరిస్థితి. భారతదేశంలో ఉన్న ఎయిర్ వేస్ అన్నింటిలోకి జెట్ ఎయిర్ వేస్ పైలెట్లు ఇలా మందు కొట్టేసి అడ్డంగా బుక్ అవుతారని తేలింది.
పైలెట్లు తాగి విమానాల్ని నడిపితే వారికి విధించే శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయి. అయినప్పటికీ కొందరు పైలెట్లు అవేమీ పట్టించుకోకుండా తాగేసి వచ్చి దొరికిపోతున్నారు. ఇలా దొరికిపోయిన వారిలో ఎక్కువ మంది జెట్ ఎయిర్ వేస్ కు చెందిన పైలెట్లు కావటం గమనార్హం. 2013 నుంచి 2015 మధ్యకాలంలో జెట్ ఎయిర్ వేస్ .. దాని అనుబంధ సంస్థలకు చెందిన ఎయిర్ వేస్ పైలెట్లు 38 మంది తాగేసి పట్టుబడిన వైనం విస్మయానికి రేకెత్తిస్తోంది. ఇప్పుడు చెప్పండి.. జెట్ ఎయిర్ వేస్ లో ప్రయాణించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించరు..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/