Begin typing your search above and press return to search.
యూపీ బాటలోనే ఇంకో రాష్ట్రం...
By: Tupaki Desk | 28 March 2017 8:52 AM GMTఅక్రమ కబేళాల విషయంలో ఇప్పటికే యూపీ కొత్త సీఎం యోగి ఆదిత్యనాథ్ కొరడా ఝులిపించిన సంగతి తెలిసిందే. ఇదే వరుసలో జార్ఖండ్ సైతం ఉత్తరప్రదేశ్ రాష్ర్టాన్ని అనుసరిస్తున్నది. 72 గంటల్లో అక్రమ కబేళాలను మూసివేయాలని జార్ఖండ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పౌరుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. అక్రమ కబేళాలు మూసివేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రభుత్వ అనుమతి తీసుకున్న కబేళాలు పశుసంవర్ధక శాఖ మరియు ఆరోగ్య శాఖ నిబంధనలను పాటించాలని సూచించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ రహాతే ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులకు లేఖలు రాశారు.
ఇదిలాఉండగా...ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం తీసుకున్న కబేళాల మూసివేత నిర్ణయం అక్కడి ప్రజల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మాంసం వ్యాపారాన్ని నమ్ముకుని ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనం సాగిస్తున్న దాదాపు 6.5 లక్షలమంది ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ప్రత్యక్షంగా రూ. 22 వేల కోట్ల వ్యాపారానికి గండిపడినట్టు వ్యాపారస్తులు వాపోతున్నారు. 'అక్రమం' పేరుతో విజిలెంట్ గ్రూపులు తమపై వేధింపులకు పాల్పడుతున్నారని కూడా వ్యాపారులు ఆరోపిస్తున్నారు. యూపీలో భారీ యంత్రాలతో నిడిచే పెద్ద మాంసం ప్రాసెసింగ్ ప్లాంట్స్ నాలుగు మూతపడ్డాయి. బీఎస్ పీ మాజీ ఎంపీ కుటుంబసభ్యులు నడుపుతున్న ఎద్దు మాంసం ప్రాసెసింగ్ ప్లాంట్‌ను కూడా అధికారులు మూసివేశారు. బీఫ్ మాంసం కలిసిందేమోనన్న అనుమానంతో ఈ ప్లాంట్‌లోని మాంసం నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. 'ఇక్కడ భారీ యంత్రాలతో కూడిన 40 యూనిట్ల వరకూ ఉన్నాయి. ఇవన్నీ అవసరమైన ఆమోదాలు తీసుకునే నడుస్తున్నాయి. అనేక ఏండ్లుగా 70కుపైగా దేశాలకు ఎద్దుమాంసాన్ని ఎగుమతి చేస్తున్నాయి' అని ఆలిండియా మీట్ అండ్ లైవ్ స్టాక్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఫౌజన్ అలవీ చెప్పారు.
ఈ విషయంలో జోక్యం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జోక్యం చేసుకోవాల్సిందిగా కోరుతూ సీఎంఓకు అసోసియేషన్ వినతిపత్రం అందచేసింది. 'దేశంలో ఎగుమతయ్యే మాంసంలో యూపీలోనే 60 నుంచి 70 వరకూ ఉంది. డైరీ లెదర్ రంగాలను కలుపుకుని ఈ పరిశ్రమను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దాదాపు 6.5 లక్షలమంది జీవనోపాధిని సాగిస్తున్నారు. ఇలా అర్థాంతరంగా మూసివేయడంతో వారు రోడ్డున పడుతున్నారు' అని ఆలిండియా మీట్ అండ్ లైవ్‌స్టాక్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఫౌజన్ అలవీ వాపోయారు. విజిలెంట్ గ్రూపులు వేధింపులకు పాల్పడుతున్నారని, ఎద్దు మాంసం తరలిస్తుండగా ట్రక్కులను ఆపి బలవంతపు వసూళ్ళకు పాల్పడుతున్నారని కొందరు యజమానులు ఆరోపిస్తున్నారు. తన ప్లాంట్‌ను మూసివేయడంతో దాదాపు 1,300 మంది కార్మికుల బతుకులు చిన్నాభిన్నమయ్యాయని, ఉపాధిని కోల్పోయి వీధుల్లోకొచ్చారని ఈగల్ కాంటినెంటల్ ఫుడ్స్ జనరల్ మేనేజర్ ఇంతెకాబ్ ఆలం చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/