Begin typing your search above and press return to search.
బీజేపీ అధ్యక్షుడి పుత్రరత్నం అలా చేశాడా?
By: Tupaki Desk | 1 July 2016 11:33 AM GMTజార్ఖండ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి పుత్రరత్నం లీలలు ఇప్పుడా రాష్ట్రంలో సంచలనంగా మారటమే కాదు.. హాట్ టాపిక్ అయి కూర్చున్నాయి. ఒక అమ్మాయితో ప్రేమాయణం.. మరోవైపు 11 ఏళ్ల మైనర్ బాలికతో వివాహంపై రచ్చ జరుగుతోంది. ఒకే సమయంలో తెరపైకి వచ్చిన ఇద్దరు ఆడపిల్లల వ్యవహారం ఆ రాష్ట్ర బీజేపీ వర్గాలకు పెద్ద తలనొప్పిగా మారింది.
జార్ఖండ్ రాష్ట్ర బీజేపీ చీఫ్ తాల మరాండీ. అతగాడి పుత్రరత్నం పేరు మున్నా మరాండీ. ఒక అమ్మాయితో స్నేహంగా ఉంటూ.. ఆమెను శారీరకంగా వాడుకొని.. తర్వాత వదిలేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. శారీరకంగా వాడుకొని మోసగించినట్లుగా ఒక మహిళ తాజాగా ఆరోపణ చేసింది. తనతో ప్రేమగా ఉంటూ.. తనకో సెల్ ఫోన్ కూడా బహుమతిగా ఇచ్చినట్లుగా ఆమె చెబుతోంది.
తనను పెళ్లి చేసుకుంటానని చెప్పిన మున్నా మాట తప్పినట్లుగా ఆమె ఆరోపిస్తోంది. మరోవైపు గత మంగళవారం 11 ఏళ్ల మైనర్ బాలికను మున్నా పెళ్లి చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. నిజానికి ఈ పెళ్లి రిసెప్షన్ కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రఘువర్ దాస్ హాజరుకావాల్సి ఉన్నా.. ఈ పెళ్లి మీద నెలకొన్న వివాదంతో ఆయన ఫంక్షన్ కు డుమ్మా కొట్టినట్లు చెబుతారు. మొత్తంగా జార్ఖండ్ రాష్ట్ర అధికారపక్ష అధినేత కొడుకి లీలలు ఇప్పుడక్కడి విపక్షాలకు అయుధంగా మారాయి. దీంతో అక్కడి కమలనాథులు ఈ విషయంలో ఏం చేయాలో అర్థం కాక కిందామీదా పడుతున్నట్లు చెబుతున్నారు.