Begin typing your search above and press return to search.

హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తున్నోళ్లు ఆ సీఎం కంట ప‌డితే..

By:  Tupaki Desk   |   23 Nov 2017 8:59 AM GMT
హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తున్నోళ్లు ఆ సీఎం కంట ప‌డితే..
X
ఇదో రాష్ట్ర ముఖ్య‌మంత్రి ముచ్చ‌ట‌. దేశంలో చాలానే రాష్ట్రాలు ఉన్నా వెనుక‌బ‌డిన జార్ఖండ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ర‌ఘ‌వ‌ర్ దాస్ వ్య‌వ‌హార‌శైలి కాస్త భిన్నం. కొన్ని త‌ప్పుల విష‌యంలో మిగిలిన ముఖ్య‌మంత్రుల మాదిరి చూసీ చూడ‌న‌ట్లుగా వ‌దిలేసే ర‌కం కాదు. తానే సీన్లోకి వ‌చ్చేశారు. ఇంత‌కీ ఆ సీఎం ఎవ‌రు? ఆయ‌నేం చేస్తార‌న్న‌ది చూస్తే..

జార్ఖండ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ర‌ఘువర్ దాస్ రెడ్డు మీద‌కు వ‌స్తే.. త‌న ముందు నుంచి హెల్మెట్ లేకుండా వెళుతుంటే అస్స‌లు ఒప్పుకోరు.

వారిని ఆపి మ‌రీ.. చ‌లానాలు క‌ట్టిస్తుంటారు సీఎం. తాజాగా జార్ఖండ్ లోని ఎగ్రికో మైదానంలో జ‌రిగిన అధ్యాత్మిక కార్య‌క్ర‌మంలో పాల్గొని తిరిగి రాంచీకి వ‌స్తున్నారు సీఎం. అలా వ‌స్తున్న ఆయ‌న‌కు ఇద్ద‌రు విద్యార్థులు హెల్మెట్ లేకుండా బైక్ న‌డ‌ప‌టాన్ని చూశారు.

వెంట‌నే బైకును ఆపేసిన సీఎం.. వారికి క్లాస్ పీకారు. హెల్మెట్ ప్రాధాన్య‌త‌ను చెప్పారు. హెల్మెట్ లేకుండా వాహ‌నం న‌డ‌పొద్దంటూ కౌన్సెలింగ్ ఇచ్చారు. అలా ఆయ‌న‌కు మ‌రో ముగ్గురు కూడా హెల్మెట్ లేకుండా క‌నిపించారు. వారంద‌రికి చ‌లానాలు వేయాల‌ని అధికారుల‌కు ఆదేశాలు ఇచ్చారు సీఎం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సీఎం చ‌లానాలు వేసిన‌ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు ఉండాల్సింది. కానీ ఉండ‌లేదు. ఇటీవ‌ల కాలంలో పెరిగిన ర‌వాణా మార్గాన్ని ఎందుకు వినియోగించుకోవ‌టం లేద‌న్న విష‌యాన్ని ప్ర‌శ్నించ‌టంతో పాటు.. హెల్మెట్ వినియోగం త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని.. అవ‌స‌ర‌మైతే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ అక్క‌డున్న ఉన్న‌తాధికారుల‌కు హిత‌బోధ చేశారు. ఏమైనా త‌న ప‌ని తీరుతో మిగిలిన సీఎంల కంటే తాను చాలా డిఫ‌రెంట్ అన్న‌ది జార్ఖండ్ సీఎం త‌న చేత‌ల‌తో నిరూపించార‌ని చెప్పొచ్చు. మ‌రి.. ఇదే రీతిలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కానీ స్పెష‌ల్ డ్రైవ్ పెడితే.. త‌ల్లిదండ్రుల‌కు అవ‌గాహ‌న‌తో పాటు.. హెల్మెట్ లేకుండా న‌డిపితే అడ్డంగా బుక్ అవుతామ‌న్న భావ‌న తీసుకొస్తే ఎంత బాగుండు..!