Begin typing your search above and press return to search.
కడుపు నొప్పికి కండోమ్ వైద్యం!
By: Tupaki Desk | 29 July 2019 7:33 AM GMTకడుపు నొప్పితో బాధ పడుతూ ఏదైనా మాత్రో - టానిక్కో - ఇంజక్షనో రాసిస్తాడన్న ఆశతో డాక్టరు వద్దకు వెళ్లిన మహిళకు ఊహించని షాక్ తగిలింది. డాక్టరు రాసిచ్చిన చీటీ తీసుకుని మందులు దుకాణానికి వెళ్లగా వారు అక్కడిచ్చినది చూసి షాక్ తింది. ఇదెందుకు ఇచ్చారు అని మందుల షాపు వారిని అడిగితే డాక్టరు రాసింది అదే కాబట్టి తాము అదే ఇచ్చాం అని చెప్పడంతో ఆ మహిళకు కళ్లు బైర్లు కమ్మాయి. ఇంతకీ... ఆ డాక్టరు చీటీపై రాసింది... చీటీ ప్రకారం మందుల దుకాణం వారు ఇచ్చింది ఏంటో తెలుసా? కండోమ్.
అవును.. కడుపు నొప్పితో బాధపడుతూ తన దగ్గరకు వచ్చిన మహిళకు ప్రిస్క్రిప్షన్ పై కండోమ్ రాశాడా వైద్యుడు. జార్ఖండ్ లో చోటుచేసుకున్న ఈ విచిత్ర ఉదంతంపై అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. జార్ఖండ్ లోని వెస్ట్ సింగ్ భంకు చెందిన క్లాస్ 4 గ్రేడ్ మహిళా ఉద్యోగిని ఒకరు కడుపు నొప్పితో బాధపడుతూ ఘాట్ శిలా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. ఆమెను పరీక్షించిన కాంట్రాక్ట్ వైద్యుడు అష్రాఫ్ బాదర్ మందులుగా కండోములు రాసిచ్చాడు. మందుల చీటీ తీసుకుని మెడికల్ షాపునకు వెళ్లిన మహిళ షాక్ కు గురైంది. వైద్యుడు అందులో రాసినవి మందులు కావని - కండోములని షాపులోని వ్యక్తి చెప్పడంతో నిర్ఘాంతపోయింది.
డాక్టరు చేసిన వెధవ పనితో తీవ్రంగా ఆగ్రహించిన ఆ మహిళ వెంటనే వెళ్లి వైద్యాధికారులకు ఫిర్యాదు చేసింది. విషయం బయటకు రావడంతో వైద్యుడి తీరుపై జనం మండిపడ్డారు. మరోవైపు విపక్ష జార్ఖండ్ ముక్తిమోర్చా సభ్యులు ఈ విషయాన్ని అసెంబ్లీలో లేవనెత్తారు. బాధిత మహిళ ఫిర్యాదుపై స్పందించిన వైద్యాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. అయితే.. ఆ వైద్యుడు ఎందుకలా చేశారన్నది మాత్రం తెలియలేదు. ఆయనా దీనిపై ఇంతవరకు పెదవి విప్పలేదు.