Begin typing your search above and press return to search.

వేల కోట్ల బొగ్గుస్కాం...మాజీ సీఎం దోషీ

By:  Tupaki Desk   |   13 Dec 2017 5:33 PM GMT
వేల కోట్ల బొగ్గుస్కాం...మాజీ సీఎం దోషీ
X
అక్రమ బొగ్గుబ్లాకు కేటాయింపు కేసులో సీబీఐ ప్ర‌త్యేక న్యాయ‌స్థానం కీల‌క తీర్పు వెలువ‌రిచింది. జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి మధుకొడా - కేంద్ర బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి హెచ్‌ సీ గుప్తాను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా తేల్చింది. జార్ఖండ్‌ లోని రాజ్‌ హరా నార్త్‌ బొగ్గుగనిని కోల్‌ కతాకు చెందిన విసుల్‌ కంపెనీకి కేటాయించడంలో అవినీతితోపాటు ఇతర నేరాలకు పాల్పడ్డారని మధుకొడా - గుప్తా - జార్ఖండ్‌ మాజీ ముఖ్యకార్యదర్శి ఏకే బసు - ప్రైవేట్‌ కంపెనీ విని ఐరన్‌ అండ్‌ స్టీల్‌ ఉద్యోగ్‌ లిమిటెడ్‌ (విసుల్‌)ను సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి భరత్‌ పరాశర్‌ దోషులుగా ప్రకటించారు. గురువారం శిక్షలు ఖరారు చేయనున్నారు.

ఈ కేసులో మధుకొడా - గుప్తా - జార్ఖండ్‌ మాజీ ముఖ్యకార్యదర్శి ఏకే బసు - ప్రైవేట్‌ కంపెనీ విని ఐరన్‌ అండ్‌ స్టీల్‌ ఉద్యోగ్‌ లిమిటెడ్‌ (విసుల్‌)ను సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి భరత్‌ పరాశర్‌ తో పాటు విసుల్‌ డైరెక్టర్‌ వైభవ్‌ తులస్యన్‌ - ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు బసంత్‌ కుమార్‌ భట్టాచార్య - బిపిన్‌ బిహారీ సింగ్‌ - చార్టెడ్‌ అకౌంటెంట్‌ నవీన్‌ కుమార్‌ తులస్యన్‌ పై సీబీఐ అభియోగాలు మోపింది. ఇంతకుముందు నిందితులకు ఐపీసీ సెక్షన్లు 120బీ - 420 - 409 - అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద కోర్టు సమన్లు జారీ చేసింది. సీబీఐ ప్రకారం.. 8 జనవరి 2007న రాజ్‌ హరా నార్త్‌ బొగ్గుబ్లాకును తమకు కేటాయించమని కోరుతూ విసుల్‌ కంపెనీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఈ కంపెనీకి బొగ్గుగనిని కేటాయించాలని జార్ఖండ్‌ ప్రభుత్వం గానీ - కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖగానీ కేంద్రానికి ప్రతిపాదించలేదు. కానీ 36వ స్క్రీనింగ్‌ కమిటీ ఈ ప్రతిపాదన చేసింది.

కాగా, కమిటీ చైర్మన్‌ గా వ్యవహరించిన గుప్తా నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ వద్ద నిజాలను దాచిపెట్టి.. విసుల్‌ కు బొగ్గుబ్లాకు కేటాయించేలా చేశారు. మధుకొడా, ఏకే బసు, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు విసుల్‌ కు అనుకూలంగా కుట్ర పన్నారని సీబీఐ ఆరోపించింది.