Begin typing your search above and press return to search.

గోడ‌ల‌పై మోడీ పేర్లు...ల‌క్కీ డ్రా ఎంపిక షురూ

By:  Tupaki Desk   |   27 Dec 2016 5:54 AM GMT
గోడ‌ల‌పై మోడీ పేర్లు...ల‌క్కీ డ్రా ఎంపిక షురూ
X
విద్యార్థుల్లో దేశభక్తితోపాటు జనరల్ నాలెడ్జ్ పెంపొందించడం కోసం జార్ఖండ్ ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదుల గోడలపై జాతీయ గీతంతోపాటు ప్రధాని - సీఎం పేర్లను రాయించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు జార్ఖండ్ రాష్ట్ర విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు వెళ్లాయి. 1 నుంచి 8వ తరగతి గదుల గోడలపై స్వాతంత్య్ర సమరయోధులు - జాతీయోద్యమ నేతల ఫొటోలతోపాటు - జాతీయ పక్షి - జాతీయ జంతువు - గవర్నర్ పేర్లను రాయించాలని పేర్కొన్నారు. గోడలపై ఉన్న రాతలు - ఫొటోలను ప్రతిరోజు విద్యార్థులు చూస్తుంటే అవి వారి మదిలో చిరకాలం నిలిచిపోతాయని, వారికి దేశ - రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై పరిజ్ఞానం పెరుగుతుందని జిల్లా విద్యాధికారి రతన్‌ కుమార్ తెలిపారు.

ఇదిలాఉండ‌గా...ఆన్‌ లైన్ పేమెంట్స్ చేసే వినియోగదారులు - వ్యాపారుల్లో రోజుకు 15,000 మందిని లక్కీడ్రా ద్వారా ఎంపిక చేసి బహుమతులు అందించే ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. నవంబర్ 9 నుంచి డిసెంబర్ 21 వరకు ఎనిమిది కోట్ల ఆన్‌ లైన్ లావాదేవీలు జరుగగా 15వేల మందిని ఎంపిక చేసినట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. రాబోయే 24 గంటల్లో విజేతలకు ఎస్‌ ఎంఎస్ వస్తుందని, వారి ఖాతాలో రూ.1000 జమ చేయనున్నట్టు పేర్కొన్నది. ఎలక్ట్రానిక్స్ - ఐటీ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మరో ప్రకటనలో డిజిటల్ పేమెంట్స్‌ పై అవగాహన పెంచేందుకు ఛత్తీస్‌ ఘడ్‌ లోని దంతెవాడ జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామమైన పల్నార్‌ లో శిబిరం నిర్వహించినట్టు పేర్కొన్నది. అదేవిధం గా కేంద్రం ఏర్పాటు చేస్తున్న డిజీధన్ మేళా సోమవారం హర్యానాలోని గురుగ్రామ్‌ లో జరిగింది. ఇందులో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ - రెజ్లర్ యోగేశ్వర్ దత్ - సింగర్ శివాని కశ్యప్ తదితరు లు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/