Begin typing your search above and press return to search.
అసెంబ్లీలో వైన్ షాప్?
By: Tupaki Desk | 9 Dec 2017 4:35 AM GMTఅందరూ వెళ్లే వైన్ షాపుల్లో ఆ ఎమ్మెల్యేలు మద్యం కొనుక్కోలేకపోతున్నారట.. అక్కడకు తాము స్వయంగా వెళ్లలేకపోవడం ఒక సమస్య అయితే, అవి నిత్యం కిక్కిరిసి ఉండడం మరో సమస్యట. అందుకే.. జార్ఖండ్‌లోని ఎమ్మెల్యేలు తమ కోసం ప్రత్యేకంగా అసెంబ్లీలోనే ఒక వైన్ షాప్ పెట్టించమని అడుగుతున్నారు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది ముమ్మాటికీ నిజం. అసెంబ్లీ ప్రాంగణంలోనే మద్యం దుకాణం ఏర్పాటు చేయాలని జార్ఖండ్ ఎమ్మెల్యేలు కొందరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆ రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్స్ ను రద్దు చేసిన ప్రభుత్వం స్వయంగా దుకాణాలు తెరిచింది. ఇవి చాలా తక్కువ సంఖ్యలో ఉండడంతో ఎప్పుడు చూసినా రద్దీగా ఉంటున్నాయి. దుకాణాల ముందు భారీగా క్యూలు కనిపిస్తున్నాయి. దీంతో పాపం ఎమ్మెల్యేలు ఏమాత్రం ఆగలేకపోతున్నారట. అందుకే... మద్యం దుకాణాల్లో ఎప్పుడు చూసినా క్యూలు కనిపిస్తున్నాయని, మద్యం కొనుగోలు ఇబ్బందిగా మారిందని, కాబట్టి అసెంబ్లీ ప్రాంగణంలోనే ఓ దుకాణం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
వీరేదే మాట వరుసకు ఈ మాట చెప్పి ఊరుకోవడం లేదు. ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఈ విషయాన్ని లేవనెత్తుతామని అంటున్నారు. ఈ విషయంలో స్పీకర్ సాయం తీసుకుని ముఖ్యమంత్రిని ఒప్పిస్తామని ఎమ్మెల్యేలంతా ముక్తకంఠంతో చెబుతున్నారు.
అయితే... ఎమ్మెల్యేల డిమాండు వెనుక అసలు కారణం వేరే ఉందంటున్నారు. ఇంతకాలం మద్యం దుకాణాలను ప్రయివేటు వ్యక్తులు నడిపించేవారు. అన్ని రాష్ర్టాల్లో ఉన్నట్లే అక్కడా సిండికేట్లు - మద్యం మాఫియా అంతా ఉండేది. దీంతో నేతల ప్రమేయం చాలా కామన్. అందువల్ల ఏనాడూ కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఏ బ్రాండు కావాలంటే ఆ బ్రాండు వచ్చి ఇంట్లో వాలేది. కానీ... ఇప్పుడు గవర్నమెంటు దుకాణాలు కావడంతో లెక్కలు - పద్దుల చిక్కులు వచ్చి ఎమ్మెల్యేలకు సప్లయ్ తగ్గిపోయిందట. దీంతో రోజూ జేబులో డబ్బు తీసి అంతంత ఖరీదైన మద్యం కొనడం ఎందుకన్న ఆలోచనతోనే వారు అసెంబ్లీలో షాపు పెట్టించేందుకు ప్లాన్ చేశారంటున్నారు. ముందు షాపు పెట్టిస్తే, ఆ తరువాత దానికి ఎమ్మెల్యే కోటా వంటివి ఏర్పాటు చేసి తక్కువ రేటుకో - వీలైతే ఫ్రీగానో తీసుకువెళ్లొచ్చన్నది వారి ప్లానని మందు ఏమాత్రం అలవాటు లేని జార్ఖండ్ ఎమ్మెల్యేలు కొందరు విమర్శిస్తున్నారు.
కాగా... జార్ఖండ్ ఎమ్మెల్యేల కోరికపై జనం సెటైర్లు కూడా వేస్తున్నారు. మామూలుగా అయితే ఎమ్మెల్యేలు సరిగా హాజరుకావడం లేదని, అసెంబ్లీలో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే అప్పుడు ప్రతిరోజూ అసెంబ్లీకి వస్తారని అంటున్నారు. అంతేకాదు... 365 రోజులూ అసెంబ్లీ పెట్టమంటారని సెటైర్లు వేస్తున్నారు.