Begin typing your search above and press return to search.
జియాది ఆత్మహత్య కాదా.. హత్యా?
By: Tupaki Desk | 21 Sep 2016 9:31 AM GMT‘నిశ్శబ్ద్’ ఈ సినిమా చాలామందికి గుర్తుండే ఉంటుంది. అమితాబ్ నటించిన ఈ చిత్రంలో జియా ఖాన్ హీరోయిన్. తన హాట్ హాట్ లుక్స్ తో ఈ చిత్రం ద్వారా బాగా పాపులర్ అయింది. ఆ తరువాత, కొన్ని హిందీ సినిమాలో నటించింది. అయితే, అనూహ్యంగా 2013, జూన్ 3న జియా ఖాన్ మరణించింది. ముంబైలోని జుహూ అపార్ట్‌మెంట్స్ లో మృతదేహమై కనిపించింది. ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టడంతోనే జియా ఆత్మహత్యకు పాల్పడిందని అప్పట్లో కథనాలు వచ్చాయి. ఆదిత్యా పంచోలీ కుమారుడు సూరజ్ పంచోలీతో జియాలో ప్రేమాయణం సాగించింది. ఆమె మరణం తరువాత సూరజ్ ను కూడా పోలీసులు విచారించారు. సినిమాల్లో అవకాశాలు తగ్గడం వంటి కారణాలతో మానసికంగా కృంగిపోయి జియా ఆత్మహత్య చేసుకుందనీ అప్పట్లో ప్రచారం సాగింది. మొత్తానికి ఆమెది ఆత్మహత్యే అని ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే, జియాది ఆత్మహత్య కాదు.. హత్య అని నిరూపించే ఒక నివేదిక ఇప్పుడు బయటకి రావడం సంచలనం రేకెత్తిస్తోంది.
ఈ కేసులో హత్య కోణాన్ని పరిశోధించేందుకు జియా తల్లి రుబియా ఖాన్ బ్రిటిష్ ఫోరెన్సిక్ నిపుణులను రంగంలోకి దించారు. దీంతో వారి పరిశోధనల్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకి వచ్చాయి. బ్రిటిష్ ఫోరెన్సిక్ నిపుణుల రిపోర్టు ప్రకారం... జియా దేహం మీద రెండు గాయాలున్నట్టు గుర్తించారు. ఒకటీ ముఖం మీద, మరొకటి మెడ మీద ఉందట! దుపట్టాతో ఉరి వేసుకుని ఉంటే ఈ గాయాలు ఎలా తగిలాయన్నది వారి ప్రశ్న. ఏదైనా బలమైన వస్తువుతో కొట్టడం వల్లనే ఈ గాయాలు అయి ఉంటాయని తాజా నివేదిక చెబుతోంది. సో.. జియాది ఆత్మహత్యలా అనిపించడం లేదని ఆ నివేదికలు చెబుతున్నాయి.
అయితే, యూకే ఫోరెన్సిక్ రిపోర్టులను సూరజ్ తండ్రి ఆదిత్య పంచోలీ కొట్టిపారేశారు. ఇవి డబ్బులిచ్చి తయారుచేయించుకున్న కట్టుకథలు అని విమర్శించారు. ఈ కేసు విషయంలో కోర్టు ఏం చెబితే దాన్ని అంగీకరిస్తా అంటున్నారు. మొత్తానికి, తాజా నివేదికలతో మరోసారి జియా ఖాన్ కేసు వార్తల్లోకి వచ్చింది. ఇంతకీ, జియాది హత్యా... ఆత్మహత్యా అనేది ఇంకా నిరూపణ కావాల్సి ఉంది!