Begin typing your search above and press return to search.
మా ఆయన ఎక్కువగా ప్రిపేర్ అయ్యారు.. మీడియాతో జిల్ షాకింగ్ వ్యాఖ్యలు
By: Tupaki Desk | 11 Jun 2021 5:30 AM GMTకరోనా ఎపిసోడ్ షురూ అయిన తర్వాత భారీ ఎత్తున శిఖరాగ్ర సమావేశాలు.. అంతర్జాతీయ వేదికలు.. ఒప్పందాలు.. ఇలాంటివేమీ పెద్దగా జరగని పరిస్థితి. ఒకవేళ జరిగినా.. వర్చువల్ విధానమే తప్పించి.. దేశాధినేతలు.. ప్రధానులు పెద్ద ఎత్తున విదేశీ పర్యటనలు చేస్తున్నది లేదు. దేశంలో సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గు ముఖం పడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు అంతర్జాతీయంగా కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతోంది.
ఇదిలా ఉంటే..తాజాగా బ్రిటన్ లో జీ7 శిఖరాగ్రసమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బ్రిటన్ కు వచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇదే. భార్య జిల్ బైడెన్ తో కలిసి వచ్చిన ఆయన.. ఉల్లాసంగా.. ఉత్సాహంగా కనిపించారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే..అమెరికా ఫస్ట్ లేడీ మీడియాతో మాట్లాడారు. తమ తాజా పర్యటనకు సంబంధించి కీలక వ్యాఖ్య చేశారు. ‘ఈ టూర్ కోసం బైడెన్ ఎక్కువగా ప్రిపేర్ అయి వచ్చారు. జి7, యూరప్ నేతలు.. చివర్లోరష్యా అధ్యక్షుడు పుతిన్ తో మీటింగ్ గురించి ఎంతో ప్రిపేర్ అయ్యారు. కొద్ది వారాలుగా చదివిందే చదువుతున్నారు. విదేశాంగ విధానం అంటే ఆయనకు ఎంతో ఇష్టం’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా బైడెన్ తన తాజా పర్యటనను లైట్ తీసుకోలేదని.. పక్కాగా ప్రిపేర్ అయినట్లుగా జిల్ మాటలు చెప్పేశాయి. మరి.. అంతలా ప్రిపేర్ అయిన బైడెన్ జీ7లో తనదైన ముద్ర ఎంత వేస్తారో చూడాలి.