Begin typing your search above and press return to search.
క్రికెట్ కంటే అదే నయం.. నీషమ్ ట్వీట్ వైరల్
By: Tupaki Desk | 15 July 2019 11:12 AM GMTఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ లో చివరి వరకు పోరాడి ఓడిన న్యూజిలాండ్ పై ప్రపంచవ్యాప్తంగా సానుభూతి వ్యక్తమవుతోంది. ఐసీసీ నిబంధనల కారణంగా గెలిచిన ఇంగ్లండ్ ది గెలుపే కాదంటూ కామెంట్లు వినపడుతున్నాయి. అయితే ఫైనల్ లో సూపర్ ఓవర్ లో కివీస్ ను గెలిపించడానికి కివీస్ బ్యాట్స్ మెన్ నీషమ్ శక్తివంచన లేకుండా చివరి వరకు పోరాడాడు. సిక్స్ కూడా కొట్టాడు. అదృష్టం కలిసిరాక కివీస్ ఓడిపోవాల్సి వచ్చింది. దీంతో వరుసగా రెండోసారి ప్రపంచకప్ ఫైనల్ లో ఓడి రన్నరప్ తో కివీస్ వెనుదిరగాల్సి వచ్చింది.
ఫైనల్ మ్యాచ్ లో బ్యాట్ తో బంతితో అద్భుతంగా రాణించిన ఆల్ రౌండర్ నీషమ్ ను కివీస్ ఓటమి ఆవేదనకు గురిచేసినట్లుంది. తుదికంటా అతడు గెలిపించడానికి సూపర్ ఓవర్ లో పోరాడాడు. ఈ ఓటమిని జీర్ణించుకోలేని నీషమ్ తాజాగా చేసిన ట్వీట్ అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది.
‘పిల్లలూ.. క్రీడల్లోకి మాత్రం మీరు రావద్దు.. వంటపని గానీ.. మరేదైనా ప్రొఫెషన్ గా ఎంచుకోండి. అలా అయితేనే 60 ఏళ్లకే ఆరోగ్యంగా ఉంటూ హ్యాపీగా చనిపోవచ్చు’ అంటూ నీషమ్ తన ట్విట్టర్ అకౌంట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ పిల్లలు క్రికెట్ పై ప్రేమ పెంచుకుంటూ క్రికెటర్లుగా మారాలని కలలుగంటున్న వారికి నీషమ్ ఇచ్చిన ఈ సలహా ఇప్పుడు అందరినీ షాక్ కు గురిచేస్తోంది. గెలుపు అంచులకు వచ్చి నిబంధనలతో ఓడిపోవడంతో అతడి ఆవేదన కల్లకు కడుతోంది.