Begin typing your search above and press return to search.
జిన్ పింగ్ ఇదేందిదీ..యుద్ధానికి రెడీగా ఉండాలని సైన్యానికి పిలుపు
By: Tupaki Desk | 15 Oct 2020 3:30 AM GMTసరిహద్దుల్లో బలగాలను మోహరిస్తూ నిత్యం కవ్విస్తున్న చైనా మరో దుస్సాహసానికి ఒడి గట్టింది. ఇటీవలే చైనా సైన్యం క్యాంపులను సందర్శించని ఆ దేశాధి నేత జిన్ పింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. పీఎల్ఏ (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) యుద్ధానికి సిద్ధంగా ఉండాలని.. సర్వశక్తులు ఒడ్డాలని పిలుపునిచ్చాడు. ఇప్పటికే భారత్, చైనా సరిహద్దుల నడుమ తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో జిన్ పింగ్ వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. బుధవారం జీ జిన్‌పింగ్ గ్యాంగ్డాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న మిలిటరీ బేస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే
దక్షిణ చైనా సముద్రం పై చైనా పెత్తనం పై అమెరికా, భారత్ సహా పలు దేశాలు మండి పడుతున్న విషయం తెలిసిందే.
జిన్ పింగ్ ఇదేంది?
దక్షిణ చైనా సముద్రం, ఇండో-పసిఫిక్ జలాలపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పై అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ తదితర క్వాడ్ దేశాలు గుర్రుగా ఉన్నాయి. ఈ దేశాల విదేశాంగ మంత్రులు టోక్యోలో సమావేశమై చైనా తీరును తప్పుపట్టాయి. అక్టోబర్ 2న 7వ కార్ప్స్ కమాండర్ లెవల్ మీటింగ్ తర్వాత చైనా, భారత్‌లు వాస్తవాధీన రేఖ వెంట బలగాల ఉపసంహరణకు అంగీకరించాయి. ఇటువంటి సందర్భంలో జిన్ పింగ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
మా దేశ అంతర్గత విషయాలు మీకేందుకు?
మరోవైప ఇటీవల చైనా తరుచూ భారత్ అంతర్గత విషయాలపై జోక్యం చేసుకుంటున్నది. లడఖ్ ను భారత్ కేంద్రపాలిత ప్రాంతంగా చేయడాన్ని తాము ఒప్పుకోమంటూ పేర్కొన్నది. అసలు భారత్ లో అంతర్భాగంగా ఉన్న లడఖ్ విషయంలో చైనా పెత్తనమెంటని విదేశాంకశాఖ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. మా దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దంటూ సుతిమెత్తగా హెచ్చరించింది.