Begin typing your search above and press return to search.

వైజాగ్ స్టీల్స్ పై జిందాల్ ఆసక్తి

By:  Tupaki Desk   |   22 Feb 2022 9:30 AM GMT
వైజాగ్ స్టీల్స్ పై జిందాల్ ఆసక్తి
X
విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ కొనుగోలు పై జిందాల్ స్టీల్స్ అండ్ పవర్ లిమిటెడ్ కూడా ఆసక్తి చూపిస్తోంది. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

అయితే కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ నిర్ణయాన్ని ఫ్యాక్టరీలో పని చేస్తున్న ఉద్యోగ, కార్మిక సంఘాలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అలాగే వీళ్ళకు రాజకీయ పార్టీలన్నీ మద్దతుగా నిలబడ్డాయి. ఒకవైపు గ్రౌండ్ లెవల్లో ఆందోళనలు జరుగుతున్నా మరోవైపు ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం తన ప్రయత్నాలు తాను చేస్తునే ఉంది.

ఈ నేపధ్యంలోనే జిందాల్ కంపెనీ కూడా బిడ్లు దాఖలు చేసే విషయంలో బాగా ఆసక్తిగా ఉంది. ఇదేకాదు ఛత్తీస్ ఘర్ లో అమ్మకానికి ఉంచిన మరో ఫ్యాక్టరీని కూడా కొనుగులు చేసేందుకు జిందాల్ యాజమాన్యం చాలా ఇంట్రస్టు చూపుతోంది. కంపెనీ కొనుగోలు విషయంలో గతంలో దక్షిణ కొరియా సంస్ధ పోస్కో కూడా బాగా ఆసక్తి చూపిన విషయం తెలిసిందే. అయితే ఫ్యాక్టరీ దగ్గర జరుగుతున్న ఆందోళనలను చూసి పోస్కో యాజమాన్యం వెనక్కు తగ్గిందనే ప్రచారం జరిగింది.

ఆ తర్వాత అదానీ గ్రూపుతో కలిసి పోస్కో గుజరాత్ లో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు రెడీ అయిపోయింది. ఇదే కాకుండా లక్ష్మీ మిట్టల్ నాయకత్వంలోని ఆర్సెలార్ కంపెనీ, టాటా స్టీల్స్ కూడా చాలా ఆసక్తిని చూపుతున్నాయి. మొత్తానికి చివరికి ఏమవుతుందో ఏమోగానీ ఇప్పటికే స్టీల్స్ రంగంలోని దేశీయ, విదేశీ దిగ్గజ కంపెనీలన్నీ వైజాగ్ స్టీల్స్ కొనుగులో విషయంలో చాలా ఆసక్తిని చూపుతున్నది వాస్తవం. నిజానికి ఏ యాజమాన్యం కూడా వివాదాల్లో ఉన్న కంపెనీలను కొనేందుకు ఆసక్తి చూపవు. కానీ దీనిపై ఆసక్తిని ఎందుకు చూపుతున్నాయి ?

ఎందుకంటే కంపెనీ మార్కెట్ ధరలతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర చాలా తక్కువ. పైగా కంపెనీకి వందల ఎకరాల భూములున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం కోణంలో చూస్తే ఆ భూములన్నీ మార్కెట్ ధర వేల కోట్లలో ఉంటంది.

జరుగుతున్న ప్రచారం ప్రకారమైతే భూముల విలువే సుమారు 1 లక్ష కోట్ల రూపాయలు ఉంటుంది. అందుకే దిగ్గజ కంపెనీలన్నీ వైజాగ్ స్టీల్స్ ను కొనేందుకు అంతగా ఆసక్తి చూపుతున్నాయి. మరో ఏడాదిన్నర వరకు ఆందోళనల కారణంగా కంపెనీ అమ్మకం ప్రక్రియ ముందుకు సాగకుండా ఉంటే అప్పుడు ఏమి జరుగుతుందో చూడాలి