Begin typing your search above and press return to search.
గాంధీ - నెహ్రూలతో జిన్నా సమానం
By: Tupaki Desk | 5 May 2018 4:39 AM GMTఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రవీణ్ నిషాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మాగాంధీ - జవహర్ లాల్ నెహ్రూ ఏవిధంగా కష్టపడ్డారో పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నా కూడా అదే విధంగా కష్టపడ్డారని చెప్పారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ``జిన్నా విషయంలో బీజేపీ చెత్త రాజకీయాలను చేస్తోంది. దేశ స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ - నెహ్రూల పాత్ర ఎంత ఉన్నదో జిన్నా పాత్ర కూడా అంతే ఉంది. దీనినిబట్టి గాంధీ - నెహ్రూలతో జిన్నా సమానం` అని విశ్లేషించారు. యూపీలోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలోని వివాదం రేగుతున్న సంగతి తెలిసిందే. వర్సిటీలో మహ్మద్ అలీ జిన్నా చిత్రపటం ఉండటంపై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హిందుత్వ సంస్థలకు చెందిన కార్యకర్తలు ఏఎంయూ ఆవరణలోకి దూసుకొచ్చి జిన్నా చిత్రపటాన్ని తొలిగించాలంటూ ఆందోళనకు దిగారు. అయితే బయటి వ్యక్తులు క్యాంపస్ లోకి రావడాన్ని నిరసిస్తూ విద్యార్థులు నిరసన చేపట్టారు. దీంతో ఇరుపక్షాల పోటాపోటీ ఆందోళనలు ఘర్షణలకు దారితీశాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. దీంతో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
ఈ పరిణామాలపై ప్రవీణ్ నిషాద్ స్పందిస్తూ దేశ స్వాతంత్య్ర పోరాటంలో హిందూ - ముస్లింల సమాన భాగస్వామ్యం ఉందని చెప్పారు. కానీ, ప్రజల మధ్య మతపరమైన విభేదాలను సృష్టించి రాజకీయంగా లబ్ధిపొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని తెలిపారు. `బీజేపీ కులం - మతం పేరుతో ప్రజలను విభజించడానికి ప్రయత్నిస్తోంది. మనమంతా భారతీయులం. ఇందులో ముస్లింలూ ఉన్నారు. ఈ గడ్డపై జన్మించిన వారంతా భారతీయులే. వారందరికీ సమాన హక్కులుంటాయి` అని చెప్పారు. ఇదిలాఉండగా....భారతీయ ముస్లింలకు జిన్నా ఆదర్శపురుషుడేమీ కాదని కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ వ్యాఖ్యానించారు. `ఏఎంయూ అధికారుల - విద్యార్థుల దేశభక్తిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదు. ఫొటోపై నెలకొన్న వివాదాన్ని వారు సున్నితంగా పరిష్కరించుకుంటారని నమ్ముతున్నాను`` అని నక్వీ చెప్పారు. మరోవైపు జిన్నాను అవిభాజ్య భారత్‌లో మహాపురుషుడు అని వ్యాఖ్యానించిన బీజేపీ నేత - యూపీ మంత్రి స్వామిప్రసాద్ మౌర్య ప్రజలకు క్షమాపణ చెప్పాలని, పార్టీ నుంచి ఆయనను తొలిగించాలని అదే పార్టీకి చెందిన ఎంపపీ హరనాథ్ సింగ్ యాదవ్ డిమాండ్ చేశారు.