Begin typing your search above and press return to search.
జియో బంపర్ ఆఫర్.. ఐపీఎల్ ఫ్రీ..?
By: Tupaki Desk | 11 Jan 2023 11:30 PM GMTక్రికెట్ ప్రపంచంలో అత్యంత విజయవంతమైన లీగ్ ఏది..? అత్యంత ఆకర్షణీయమైన లీగ్ ఏది..? ప్రమాణాల పరంగానూ అత్యంత ఉన్నతమైన లీగ్ ఏది..? ఇంకోటి ఏముంది..? ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). ప్రపంచవ్యాప్తంగా లీగ్ లు జరుగుతుండొచ్చు.. కరీబియన్ క్రికెట్ లీగ్ (సీసీఎల్), పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్), బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) ఇలా దేని ప్రత్యేకత దానికి ఉండొచ్చు. కానీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్థాయే వేరు. ప్రపంచంలోని అన్ని క్రికెట్ లీగ్ ల విలువను కలిపినా ఐపీఎల్ లో సగం కూడా ఉంటాయని చెప్పలేం. అంతటి స్థాయి ఉన్న ఐపీఎల్ ప్రసార హక్కులే వేల కోట్లలో పలికాయి. స్టార్ టీవీ వంటి నెట్ వర్క్ లు పోటీ పడి దక్కించుకున్నాయి. మైదానంలోకి వచ్చే వారే కాక.. ఐపీఎల్ అభిమానులంతా టీవీలకు అతుక్కుపోతారు. గుడ్ న్యూస్ ను మించిన న్యూస్ సరిగ్గా ఆరేళ్ల కిందట జియోతో ఇంటర్నెట్ ను ఇంటింటికీ చేర్చిన రిలయన్స్ అంబానీ జియో ఇప్పుడు మరో సంచలనం రేపబోతోంది.
‘‘జియో సినిమా యాప్ ద్వారా ఐపీఎల్ ప్రసారాలను ఉచితంగా అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నదని తెలుస్తోంది. మరోవైపు ఇప్పుడంతా సెల్ ఫోన్ యుగం. టీవీ ఉన్నా.. చేతిలోని మొబైల్ తోనే అంతా చేసేస్తున్నారు. ఇక టీవీలు చూడ్డానికి వీలుపడని వారంతా మొబైల్ ఫోన్లను ఆశ్రయిస్తారు. ఇప్పటివరకు ఐపీఎల్ మ్యాచ్‌లు చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ కింద కొంతమొత్తం కట్టక తప్పడం లేదు. అలా.. సబ్‌స్ర్కిప్షన్ తీసుకున్నవారికే ప్రసారాలు చూసే అవకాశం ఉంది. కానీ, 2023 సీజన్ లో ఐపీఎల్ ప్రసారాలను ఉచితంగా అందించేందుకు సన్నద్ధమవుతోంది రిలయన్స్.
వచ్చే సీజన్ డిజిటల్ హక్కులు దానివే..
2023 ఐపీఎల్ సీజన్ డిజిటల్ ప్రసార హక్కులు రిలయన్స్ కే దక్కాయి. దీంతో మ్యాచ్ ప్రసారాలను ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే రిలయన్స్ నుంచి మరో సంచలనమే. కాగా, 2023 నుంచి 2027 వరకు ఐపీఎల్ ప్రసారాలకు సంబంధించి డిజిటల్ మీడియా హక్కులను రిలయన్స్ వెంచర్స్‌లో ఒకటైన వయాకామ్ 18 సంస్థ రూ.23,758 కోట్లకు దక్కించుకుంది.
ఫిఫా ఊపుతో..
ఇటీవల ముగిసిన ఫిఫా ప్రపంచ కప్ మ్యాచ్ లను జియో సినిమా యాప్‌లో ఉచితంగా ప్రసారం చేసింది రిలయన్స్. అసలే ఫుట్ బాల్ అందులోనూ ప్రపంచ కప్.. ఇంకేముంది? జనం విరగబడి చూశారు. జియో యాప్ ను పెద్దఎత్తున వినియోగించారు. ఇప్పుడిదే వ్యూహాన్ని ఐపీఎల్ మ్యాచ్‌ల విషయంలోనూ పాటించాలని భావిస్తోంది రిలయన్స్.
షరతులు వర్తిస్తాయి..
ఐపీఎల్ మ్యాచ్ లు ఫ్రీగా వస్తున్నాయి కదాని.. చూసేవారికి చిన్న మెలిక. వాస్తవానికి జియో ఉచిత వ్యూహం వెనుక తన వాటాను పెంచుకునే ఆలోచన ఉంది. ఎయిర్ టెల్ తదితర పోటీ సంస్థలను దెబ్బకొట్టే ఆలోచనతో ఫ్రీ మార్గాన్ని ఎంచుకుంది. వాటాను పెంచుకోవడంలో భాగంగా ఉచితంగా లేదా చాలా తక్కువ ధరకే ప్రసారాలను అందించాలని భావిస్తోందని సమాచారం. అయితే, నాణ్యమైన ప్రసారాల కోసం చందా ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.
అన్ని భాషల్లోనూ క్లిక్కయితే.. ఆ లెక్కే వేరు
హిందీ, ఇంగ్లిష్ మ్యాచ్ లు చూసినవారికి ఐపీఎల్ మ్యాచ్ ల తెలుగు ప్రసారాలు మొదట్లో కాస్త కష్టంగా రానురాను అలవాటైపోయింది. దీన్నికూడా పసిగట్టిన జియో.. ఐపీఎల్ ప్రసారాలను స్థానిక భాషల్లోనూ అందించాలని భావిస్తోంది. టీవీల్లో చూసేవారు సైతం డిజిటల్‌కు మారేందుకు ఇది ఓ ఎత్తుగడగా అంచనా వేస్తోంది. మరోవైప క్రికెట్ అభిమానులు ఉచితంగానే ప్రసారాలను వీక్షించే అవకాశం కలగనుండగా.. అదే సమయంలో టీవీ ప్రసారాలపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. జియో టెలికాం సబ్‌స్క్రిప్షన్ కలిగిన వారికి ఉచితంగా అందించాలని కంపెనీ యోచనగా తెలుస్తోంది. మరి ఇతర టెలికాం వినియోగదారులు వినియోగించుకోవడానికి జియో సినిమాకు సబ్‌స్క్రిప్షన్‌కు పెడతారా? లేదంటే ఏదైనా బండిల్ ప్లాన్ తీసుకొస్తారా? అనేది తెలియాల్సి ఉంది. మార్చిలో ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కాబోతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.