Begin typing your search above and press return to search.
మాంఝీ టైం అస్సలు బాగోలేదా?
By: Tupaki Desk | 14 Sep 2015 9:54 AM GMTబీహార్ మాజీ ముఖ్యమంత్రి..హిందూస్థానీ అవామ్ మోర్చా పార్టీ అధినేత జీతన్ రామ్ మాంఝీ టైం అస్సలు బాగోలేనట్లుంది. ఎన్నికలు ముంచుకొచ్చిన వేళ.. వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలు చూస్తే ఈ భావన కలగటం ఖాయం.
ఆదివారం నాడు ఆయన కుమారుడు ప్రవీణ్ కుమార్ ప్రయాణిస్తున్న కారులో పోలీసులు తనిఖీలు నిర్వహించినప్పుడు ఆయన కారు నుంచి రూ.4.65లక్షల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కుమారుడే స్వయంగా పోలీసులకు పట్టుబడటం బీహార్ లో సంచలనంసృష్టించింది. ఇదిలా ఉంటే సోమవారం.. మరో అనూహ్య ఘటన చోటు చేసుకుంది.
ఢిల్లీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో సీట్ల సర్దుబాటుకు సంబంధించిన చర్చలు సఫలం చేసుకొని.. తిరిగి వెళుతున్న ఆయన కారును మరో కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో మాంఝీకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అమిత్ షా ఇంటి నుంచి బయటకు వస్తున్న ఆయన కారును మరో కారు ఢీ కొనటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలేంటని మాంఝీ వర్గం తెగ మధనపడిపోతుందట.