Begin typing your search above and press return to search.
హరీష్ ను కావాలనే బలి చేశారు .... బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు !
By: Tupaki Desk | 11 Nov 2020 6:00 PM GMTదుబ్బాక లో జరిగిన ఉపఎన్నికలలో అధికార పక్షం అయిన తెరాసకి బిగ్ షాక్ ఇస్తూ బీజేపీ జెండా పాతేసింది. కాంగ్రెస్ కి డిపాజిట్స్ కూడా రాకపోవడం గమనార్హం. ఎన్నికల కౌంటింగ్ లో మొదటి రౌండ్ నుండే తెరాస పై ఆధిపత్యం చూపిస్తూ వచ్చిన బీజేపీ మధ్యలో రేసులో తగ్గినట్టు అనిపించినా ... నరాలు తెగే ఉత్కంఠత లో బీజేపీ అనూహ్య విజయం సాధించింది. అయితే , అక్కడ బీజేపీ గెలిచినా అధికార టీఆర్ఎస్ పార్టీలో ముసలం నెలకొంది. మంత్రి హరీశ్ రావుకి బాధ్యతలు అప్పగించడంతో ఆయన లక్ష్యంగా విమర్శలు వస్తున్నాయి. అయితే కొందరు కేసీఆర్‌పై కూడా కామెంట్స్ చేస్తున్నారు. కావాలనే హరీశ్ రావుని బలిపశువును చేశారని ధ్వజమెత్తారు.
తాజాగా బీజేపీ నేత జితేందర్ రెడ్డి కూడా సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేశారు. దుబ్బాకలో ఓడిపోతామని సీఎం కేసీఆర్ కు తెలుసు అని , తెలిసీ కూడా కావాలనే హరీశ్ రావుకు బాధ్యతలు అప్పగించారని తెలిపారు. ఉప ఎన్నిక పేరు చెప్పి బలి చేద్దామని అనుకొన్నారని జితేందర్ రెడ్డి అన్నారు. ఇవేమీ తెలియని హరీశ్ రావు ఉప ఎన్నిక ప్రచారంలో మునిగిపోయారని తెలిపారు. కానీ ఓడిపోవడంతో అందరూ హరీశ్ రావు పేరును ప్రస్తావిస్తున్నారని గుర్తుచేశారు. కానీ ఇదీ కావాలని చేసిన ఎత్తుగడ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తోందని జితేందర్ రెడ్డి తెలిపారు. 80 డివిజన్లలో గెలిచి విజయం సాధిస్తామని చెప్పారు. మేయర్ పీఠం కైవసం చేసుకోబోతున్నామని , రెండో స్థానం కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీపడతాయని చెప్పారు. బీజేపీ హిందువుల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తోందని చెప్పారు. ఎంఐఎం ముస్లింల కోసం పనిచేయడం లేదా అని అడిగారు.