Begin typing your search above and press return to search.
ఈ సంతకాల లెక్క చిత్రవిచిత్రంగా ఉందే
By: Tupaki Desk | 22 Jun 2017 7:44 AM GMTఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్ ను ఎంపిక చేస్తూ బీజేపీ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఆయన అభ్యర్థిత్వాన్ని మిత్రపక్షంగా ఉన్న పార్టీలతో పాటు.. ఎన్డీయేతో సంబంధాలు లేని కేసీఆర్.. నవీన్.. నితీశ్ లాంటోళ్లు ఓకే చెప్పేశారు. ఇంతవరకూ ఎవరికి ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు.
శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో కోవింద్ నామినేషన్ వేయనున్నారు. ఇందుకోసం నాలుగు నామినేషన్ల సెట్లను సిద్ధం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అందులో ఒక నామినేషన్ మీద ప్రధాని మోడీ.. రెండో దాని మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. మూడో దాని మీద అమిత్ షా.. నాలుగో దాని మీద పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బాదల్ లు సంతకాలు చేసినట్లుగా దాదాపు అన్ని మీడియాలలోనూ వార్తలు వచ్చాయి.
కాకపోతే.. ఇదే ఇష్యూ మీద టీఆర్ ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి చెబుతున్న మాటలతోనే లేనిపోని కన్ఫ్యూజన్ ఒకటి ఇప్పుడు వచ్చి పడింది. ఆయన చెబుతున్నట్లుగా అన్ని మీడియా సంస్థలు అచ్చేసిన వార్తను చూస్తే.. కోవింద్ కు మద్దతు పలుకుతూ టీఆర్ ఎస్ కూడా నామినేషన్ పత్రాల్ని దాఖలు చేస్తుందని.. నామినేషన్ దాఖలు కార్యక్రమానికి టీఆర్ ఎస్ అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా హాజరవుతున్నట్లుగా జితేందర్ రెడ్డి చెబుతున్నారు.
ఓపక్క నాలుగు నామినేషన్ల మీద ఎవరెవరు సంతకాలు పెట్టి దాఖలు చేస్తారో చెబుతుంటే..మరోవైపు అందుకు భిన్నంగా జితేందర్ చెబుతున్న సమాచారం అందుకు భిన్నంగా ఉండటం ఇప్పుడు కన్ఫ్యూజింగ్ గా మారింది. జితేందర్ చెప్పే దాని ప్రకారం మొదటి సెట్ మీద రాజ్ నాథ్ సింగ్.. రెండో సెట్ మీద టీఆర్ ఎస్ తరఫున తాను సంతకం చేసినట్లు చెబుతున్నారు. మరి.. ఈ సంతకాల లెక్కలో ఏది కరెక్ట్ అన్నది ఇప్పుడు సందేహంగా మారిందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/