Begin typing your search above and press return to search.
జేఎన్టీయూలో సూసైడ్ వార్నింగ్ కలకలం
By: Tupaki Desk | 27 Jan 2016 9:22 AM GMTహైదరాబాద్ లో హెచ్ సీయూ ఘటనతో రేగిన ఆందోళన, కలకలం ఇంకా చల్లారకముందే మరో ఆందోళన మొదలైంది. జేఎన్టీయూ రీసెర్చి స్కాలర్ ఒకరు అక్కడి వీసీకి రాసిన లేఖ ఇప్పుడు అందరిలో గుబులు పుట్టిస్తోంది. తనకు రావాల్సిన ఫెలోషిప్ ను ఆపేశారని... పీహెచ్ డీని మధ్యలోనే ఆపేయించారని... వివక్షతో తనను వేధిస్తున్నారని ఆయన ఆ లేఖలో రాశాడు. మదన్ మెహర్ అనే జేఎన్టీయూ విద్యార్థి వీసీ వీహెచ్ శర్మకు రాసిన లేఖలో తన సమస్యలు తీర్చకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు కూడా. దీంతో ఆ లేఖలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
కాగా మదన్ లేఖల నేపథ్యంలో జేఎన్టీయూ వీసీ శర్మ క్లారిటీ ఇస్తున్నారు. మదన్ గతంలో బ్రసెల్స్ - బెల్జియం దేశాల్లో రీసెర్చి కోసం యూనివర్సిటీ నుంచి 66 వేలు తీసుకున్నాడని... ఫెలోషిప్ రావాలంటే యూనివర్సిటీకి ఉన్న బకాయిని తీర్చాలని చెబుతున్నారు. బకాయిలు ఉన్నందున యూనివర్సిటీ కంట్రోలర్ అండ్ ఫైనాన్సింగ్ విభాగం నుంచి అనుమతి ఆగి ఫెలోషిప్ నిలిచిపోయిందని... అంతా నిబంధనల ప్రకారమే జరిగిందని వివరించారు. విద్యార్థి ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడకుండా చూడాలని.. ఓ కంట కనిపెట్టాలని సిబ్బందిని ఆదేశించామని.. త్వరలో అతని సమస్య పరిష్కరిస్తామని జేఎన్టీయూ అధికారులు చెబుతున్నారు.