Begin typing your search above and press return to search.
రాజ్ నాథ్ మాట నిజమే అయితే డేంజరే..
By: Tupaki Desk | 15 Feb 2016 7:56 AM GMTజవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో జరుగుతున్న ఆందోళనపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జేఎన్ యూ ఆందోళనల వెనుక పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా చీఫ్ సయూద్ హస్తముందని వెల్లడించారు. సయూద్ ప్రోద్బలంతోనే జేఎన్ యూలో భారత వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని వాటిని ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
పార్లమెంటు దాడి కేసులో దోషి అయిన అఫ్జల్ గురుకు అనుకూలంగా జేఎన్ యూలో కార్యక్రమం నిర్వహించడం, అఫ్జల్ గురుకు అనుకూలంగా నినాదాలు చేయడం వంటి వ్యవహారంతో రచ్చ మొదలైంది. ఈ చర్యలకు పాల్పడిన విద్యార్థినాయకులను అరెస్టు చేయడంపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరోవైపు ప్రతిపక్ష పార్టీలు మాటల యుద్ధానికి దిగాయి. ఈ నేపథ్యంలో రాజ్ నాథ్ సింగ్... ''జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జరిగినదాని వెనుక లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ మద్దతు ఉంది'' అని ప్రకటించారు. అయితే రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలను ప్రతిపక్ష పార్టీలు విశ్వసించడం లేదు. ఆయన ఊరికే అలాంటి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.
కానీ, హోం మంత్రి స్థాయిలో ఆధారాలు లేకుండా అలాంటి వ్యాఖ్యలు చేయరని... ప్రభుత్వం వద్ద కచ్చితంగా ఆధారాలు ఉండి ఉంటాయన్న వాదన వినిపిస్తోంది. అదే నిజమైతే మాత్రం ఎంతైనా ఇది ఆందోళనకర పరిణామమే.