Begin typing your search above and press return to search.

మోడీకి ఢిల్లీలో ఎదురుదెబ్బ‌

By:  Tupaki Desk   |   25 Sep 2015 9:20 AM GMT
మోడీకి ఢిల్లీలో ఎదురుదెబ్బ‌
X
బీజేపీ ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్‌ హోదాలో దేశంలో బీజేపీని ఒంటిచేత్తో విజ‌య‌తీరాల‌కు చేర్చి....బంప‌ర్ మెజార్టీ సాధించి ప్ర‌ధాన‌మంత్రి పీఠం అధిరోహించిన నరేంద్ర మోడీకి ఢిల్లీ క‌లిసిరాన‌ట్లు క‌నిపిస్తోంది. మోడీ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత వ‌చ్చిన‌ ఎన్నిక‌ల్లో ఢిల్లీ బ‌రిలో అమ్ ఆద్మీ పార్టీ సునామీ స్థాయి విజ‌యం సాధించింది. త‌ద్వారా ఢిల్లీలో అర‌వింద్ కేజ్రివాల్‌ కొర‌క‌రాని కొయ్య గా మారిపోయారు. ఇపుడు అదే ఢిల్లీలో మ‌రోమారు మోడీకి ఇబ్బంది త‌లెత్తుతోంది.

ఢిల్లీలోని జవహర్‌ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వీసీగా బీజేపీ నాయకుడు, విఖ్యాత న్యాయ‌వాది సుబ్రహ్మణ్య స్వామిని నియామకం చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం అన్నీ రెడీ చేసుకుంది. కేంద్ర మాన‌న‌వ‌న‌రుల మంత్రిత్వ శాఖ ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న కూడా చేసింది. అయితే ...త‌మ వీసీగా సుబ్ర‌మ్మ‌ణ్య‌స్వామిని నియ‌మిస్తూ తీసుకునే ఏ చర్యనైనా వ్యతిరేకిస్తామని జవహర్‌ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులు స్పష్టం చేశారు. యూనివర్సిటీ క్యాంపస్ ను కాషాయీకరణ చేయడానికి తాము ఎట్టి పరిస్థితులలోనూ అంగీకరించమని వారు స్పష్టం చేశారు. వర్సిటీ వీసీగా సుబ్రహ్మణ్యస్వామినే కాదు ఏ బీజేపీ నాయకుడినీ అంగీకరించమని వారు స్పష్టం చేశారు.

ఇప్ప‌టికే విద్యా కాషాయిక‌ర‌ణ అబండాలు ఎదుర్కుంటున్న న‌రేంద్ర‌మోడీకి తాజా ప‌రిణామం క‌చ్చితంగా ఇబ్బందిక‌రంగా మారేదేన‌ని భావిస్తున్నారు. సుబ్రహ్మణ్యస్వామి ఎంపిక‌పై ప్ర‌ధాన‌మంత్రి అమెరికా నుంచి తిరిగి వ‌చ్చిన త‌ర్వాత తుది నిర్ణ‌యం వెలువ‌డ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది.