Begin typing your search above and press return to search.
జేఎన్యూ లో దాడి.. బాలీవుడ్ తారల ఆగ్రహం
By: Tupaki Desk | 6 Jan 2020 9:11 AM GMTఢిల్లీ లోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ముసుగు ధరించిన దుండగులు విద్యార్థులపై చేసిన దాడిని బాలీవుడ్ తారలు ఖండించారు. దీనిపై సీరియస్ స్పందించారు. ట్విట్టర్ లో ఈ దమన కాండపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదివారం రాత్రి ముసుగు ధరించి కర్రలు, సుత్తెలు, ఆయుధాల తో జేఎన్యూలోకి ప్రవేశించిన దుండగులు విద్యార్థులను , ప్రొఫెసర్లను , విద్యార్థి సంఘాల నేతలపై రాళ్లతో, ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో 20మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు.
ఈ దాడిని వ్యతిరేకిస్తూ జేఎన్యూ పూర్వ విద్యార్థి , నటి స్వరా భాస్కర్ ట్వీట్ చేసి ఖండించారు. ‘తన తల్లి కూడా జేఎన్యూలో ప్రొఫెసర్ అని.. విద్యార్థులకు సాయం అందించాలని కోరారు. అంతేకాదు ఢిల్లీ వాసులంతా రోడ్లమీదకు వచ్చి ప్రభుత్వంపై, పోలీసులపై ఒత్తిడి తీసుకురావాలని.. దుండగులను అరెస్ట్ చేసే వరకూ వదిలిపెట్టవద్దని ’ డిమాండ్ చేశారు.
స్వరా భాస్కర్ ట్వీట్ కు మద్దతుగా బాలీవుడ్ తారలు ఈ హింసాకాండకు వ్యతిరేకంగా గళమెత్తారు. అజ్మి షబానా, హీరోయిన్ తాప్సీ, హీరో రితీష్ దేశ్ ముఖ్, దియా మీర్జా, విశాల్ దాద్లానీ సైతం ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు.